Telugu News

కిష్టాపురంలో దారుణ హత్య

అస్తుల పంచాయతీలో సోదరుడు హత్య

0

కిష్టాపురంలో దారుణ హత్య

== అస్తుల పంచాయతీలో సోదరుడు హత్య

== నాలుగు రోజుల క్రితం తండ్రి చనిపోతే ఆతరువాత కొడుకును హత్య చేసిన సోదరడు

(కూసుమంచి-విజయంన్యూస్);-

గత నాలుగు రోజుల క్రితం తండ్రి చనిపోయాడు.. ఆయన దశదిన ఖర్మ కార్యక్రమాలు కూడా పూర్తి కాలేదు. ఇంతలో కుమారులు అస్తుల కోసం పంచాయతీ పెట్టకున్నారు.. పైటింగ్ చేశారు.. దీంతో అన్న తోడ బుట్టిన తమ్ముడ్ని హత్య చేశాడు. కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో అమానియ సంఘటన జరిగింది.. అన్నదమ్ముళ్లు మధ్య జరిగిన ఘర్షణలో తోడ పుట్టిన తన సోదర్ని కర్రతో తలపై మోది హత్యచేసిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన శనివారం రాత్రి కిష్టాపురంలోచోటు చేసుకోగా, చికిత్సపొందుతు ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది.

also read :-నేడు ఖమ్మం జిల్లాకు షర్మిళ పాదయాత్ర

పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన జూలూరి మల్లయ్యకు ముగ్గురు కుమారులు, రాములు, జూలూరు గోవిందు(48), లక్ష్మయ్యలు, ఇద్దరు కుమార్తేలు ఉన్నారు. గత నాలుగు రోజుల క్రితం తండ్రి మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతు చనిపోయాడు. ఈ క్రమంలో అంత్యక్రియలు చేపట్టిన కుమారులు రెండు రోజులుగా నువ్వంటే నువ్వేనంటూ అస్తుల పంపకాల విషయాల్లో వాధనలాడుకోవడం ప్రారంభించారు. శనివారం ఆ పంచాయతీ కాస్తా ఘర్షణకు దారితీసింది.ఆవేశంలో ఉన్న రాములు తన తమ్ముడు జూలూరి గోవింద్ తలపై కర్రతో కొట్టాడు.

also read :-ఖమ్మంలో సందడి చేసిన సేవాదాస్ చిత్రయూనిట్

దీంతో తలకు గాయాలై కిందపడిపోయాడు. తక్ష్ణమే కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కూసుమంచి పోలీసులు పలు సెక్షనల్ల కిందా కేసు నమోదు చేశారు. కాగా ఒకే ఇంట్లో తండ్రి, నాలుగు రోజుల వ్యవధిలోనే కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో విషాదం నెలకొంది.