Telugu News

కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం .

తక్షణమే స్పందించిన స్థానిక కార్పొరేటర్ దొడ్డా నగేష్.

0

కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం .

తక్షణమే స్పందించిన స్థానిక కార్పొరేటర్ దొడ్డా నగేష్.

ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర అయ్యప్ప స్వామి టెంపుల్ వెనుక ప్రాథమిక ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంతంలో తెల్లవారుజామున కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది . చుట్టుపక్కల స్థానికులు ఇచ్చిన సమాచారానికి వెంటనే 27వ డివిజన్‌ కార్పొరేటర్ దొడ్డా నగేష్ స్పందించి వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని ఫైర్ స్టేషన్ ఆఫీసుకు , త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు , ఎమ్మార్వో ఆఫీస్ కు సమాచారం తెలియజేశారు .

ఫైర్ స్టేషన్ అధికారులు వెంటనే రెండు ఫైరింజన్లను పంపి సిబ్బందితో చెలరేగుతున్న మంటలను ఆర్పారని , అలాగే త్రీ టౌన్ సీఐ సర్వయ్య గారు ఇద్దరు కానిస్టేబుల్ లను పంపారని , ఎమ్మార్వో ఆఫీస్ నుండి వీఆర్వో మస్తాన్ వచ్చి వివరాలను తెలుసుకుని పోయారని అన్నారు . విధి వక్రీకరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం ఏమీ జరగలేదని ఆస్తి నష్టం జరిగిందని సందర్భంగా స్థానిక కార్పోరేట్ పేర్కొన్నారు .

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సామిల్ దుగడ మిషన్ యజమాని వాసి రెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ 200 వంద ఫీట్ల టెకు కర్ర , డబుల్ కాట్ మంచాల బోర్డులు , డబుల్ కాట్ మంచాలు , తలుపులు , కిటికీలు , దుగడ మిషిన్లు తో పాటు రేకుల షెడ్డు కుడా కాలిపోయిందని , దీనిని నే నమ్ముకుని సుమారుగా పది కుటుంబాలు బతుకుతున్నాయని , గత ఇరవై సంవత్సరాల నుండి ఈ వృత్తిలో ఉన్నామని , ఈ ప్రమాదంలో సుమారుగా 25 లక్షలు విలువ గల ఆస్థి నష్టం జరిగిందని తెలియజేశారు . తక్షణమే ప్రభుత్వం , దుగడ మిషన్ యూనియన్ నాయకులు ఆదుకోవాలని కోరారు.

also read :- ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నిక