దమ్మపేట మండలం మల్లారం గ్రామ శివారులో
కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి,
(అశ్వారావుపేట విజయం న్యూస్):-
మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అప్పారావుపేట వైపు నుండి వస్తున్న కారు, దమ్మపేట వైపునుండి వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయనీ తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
also read;-మావోయిస్టుల అలజడి
కారులో ప్రయాణిస్తున్న వారికి ఎయిర్ బెలూన్స్ కావడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అక్కడున్న స్థానికులు హుటాహుటిన దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.