Telugu News

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పొంగులేటి

-మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించిన నిర్వాహకులు

0

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పొంగులేటి

-మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించిన నిర్వాహకులు

(ఖమ్మం రూరల్ విజయం న్యూస్ ):-

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఖమ్మంజిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మంరూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు సమీపంలోని కార్తికేయ టౌష్టిలో అత్యంత వైభవోపేతంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.

also read :-పువ్వాడ అంటే ప్లవర్ కాదు..ఫైర్ : మంత్రి పువ్వాడ

వేదపండితుల సమక్షంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పొంగులేటి ఘనంగా సత్కారించారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల అండగా ఉ ంటానని పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, అజ్మీరా అశోక్, నగర తెరాస నాయకులు దుంపల రవికుమార్, భీమనాథుల అశోకరెడ్డి, ఆది, ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు

దొంతుపవన్ కుమార్, దొండా నర్సింహారావు, కనకం నర్సింహారావు, పాలకుర్తి లక్ష్మణ మూర్తి, రామగిరి నరేందర్ చౌదరి, రామగిరి గోవర్లన్, పెద్దపాక వెంకటేశ్వర్లు, ఆరెంపుల సతీష్, సోమిరెడ్డి, సైదులు, సురేష్ చంద్ర జవహర్, పాలకుర్తి మురళి, పగడాల మురళి, విజయ్ చౌదరి, యుగంధర్ రెడ్డి, లింగమూర్తి, శ్రావణ్, ముకేష్, మోహన్, ప్రణీత్ కుమార్, లివిన్ కుమార్, సాయినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.