పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్ష పరులు
—మండల కేంద్రంలోని హనుమాన్ గుడి నుండి కొండగట్టు వరకు…
—-పాదయాత్రగా బయలుదేరిన మండల వాసులు*
(దస్తూరాబాద్ – విజయం న్యూస్);-
ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి కి గ్రామం నుండి హనుమాన్ దీక్ష స్వాములు, గ్రామ యువకులు సుమారు వంద మందికి పైగా పాదయాత్రగా బయలుదేరుతారు. ఐతే గత రెండు సంవత్సరాలనుండి కరోనా వైరస్ ఉండడం వలన ప్రజలు కొండగట్టుకు వెళ్లలేకపోయారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా లేనందున హనుమాన్ మాలదారులు అధిక సంఖ్యలో మాల వేసుకున్నారు.
also read :-బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్ : మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి
ఈ తరుణంలో హనుమాన్ జయంతి ఈ నెల పదహారు తేదీన ఉండడం వలన జయంతి కి రెండు రోజుల ముందు నుండి పాదయాత్రగా వెళ్లి స్వామి ని దర్శించుకుంటామని దీక్ష పరులు తెలిపారు.అలాగే ఈరోజు స్వామి దర్శనార్థం పాదయాత్ర గా సుమారు వంద మంది కి పైగా భక్తులు బయలుదేరారు.