కారేపల్లి లో విద్యుత్ ఘాతంతో హెల్పర్ మృతి…ఏఈ పై దాడి
(కారేపల్లి/ కామేపల్లి- విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోనిగ వర్నమెంట్ హాస్పిటల్ పక్కన బుధవారంకరెంటు స్తంభంపై లో వోల్టేజ్ మరమ్మతులు మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ చేస్తుండగా గుంప్పెళ్ళ గూడెం గ్రామానికి చెందిన జర్పుల వీరన్న (34) విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు.సమాచారం తెలుసుకున్నకుటుంబీకులు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలంలో ఉన్న ట్రాన్స్కో ఏఈ విజయ్ కుమార్ పై ఆవేేేశంతోమూకుమ్మడిగా దాడికి పాల్పడినారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ ప్రచురించిందని కుటుంబీకుల ఆరోపించారు.
also read:-హిందూ సమాజం మేలుకోకుంటే ఉద్యోగాల్లో కూడా ప్రమాదమే
బాధిత కుటుంబానికి నష్టపరిహారం తోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలని కోరుతూ ఇల్లందు – ఖమ్మం ప్రధాన రహదారి లోని కారేపల్లి క్రాస్ రోడ్ద్ మూడుగంటలు వాహనాల రాకపోకలను స్తంభింపజేసి కుటుంబీకులకు రావలసిన ఎక్స్గ్రేషియాను జిల్లా ట్రాన్స్కోఉన్నతాధికారులు ప్రకటించేంత వరకు నిరసన విరమించేది లేదని భీష్మించుకుని ధర్నా చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాకామేపల్లి ఎస్సైకిరణ్ కుమార్ భద్రతా ఏర్పాట్లు చేశారు.