Telugu News

సస్పెండ్ అయినప్పటికి సంతకాలు చేసిన హెచ్ఎం

== చార్జ్ హెచ్ఎం ఫిర్యాదు.. ఎంఈవో విచారణ.

0

సస్పెండ్ అయినప్పటికి సంతకాలు చేసిన హెచ్ఎం

== చార్జ్ హెచ్ఎం ఫిర్యాదు.. ఎంఈవో విచారణ.

== జీళ్ళచెరువు ఉన్నతపాఠశాలలో నిర్వాహకం

(కూసుమంచి-విజయంన్యూస్);-

పనితీరు పై విమ్మర్శల అనంతరం సస్పెండైనా ప్రధానోపాధ్యాయురాలు, సస్పెండ్ అయినప్పటికి ఆమె తీరులో మార్పులేదు. సస్ఫెన్షన్ ఉత్తర్వులు తీసుకోకుండా ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి హాజరు పట్టికలో తన సస్పెన్షన్ నమోదుచేసిన కాలమ్ లో వైట్ ఫ్లూయిడ్ పెట్టిన ఉదంతం ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, జీళ్ళచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. భయపడిన ఇంచార్జ్ హెచ్ ఎం, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, స్పందించిన డీఈవో తక్షణమే విచారణకు ఆదేశించారు.

also read :-దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత

దీంతో విచారణ చేపట్టిన అధికారులు సస్పెన్షన్ తరువాత కూడా విధులకు హాజరైనట్లు స్పష్టం కావడంతో నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలం జీళ్ళచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా గా పనిచేసిన ఏ.జీ. ప్రమీల ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించటం, పదో తరగతి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయటం, విద్యార్థులతో టాయిలెట్లు కడిగించటం, పిల్లలను , వంట వాళ్లను దుర్భాశలాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు జీళ్ళచెరువు గ్రామస్థులు, విద్యార్థులు వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లా విద్యశాఖాధికారికి గత నెల క్రితం ఫిర్యాదు చేశారు.

also read :-కేంద్రంతో ప్రత్యక్షపోరాటంలో టిఆర్‌ఎస్‌

ఈ మేరకు స్పందించిన డీఈవో విచారకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఖమ్మం అర్బన్, కూసుమంచి ఎంఈవో లు విచారణ జరిపారు. వారు ఇచ్చిన నివేదక మెరకు వరంగల్ ఆర్ జేడీ సత్యనారాయణ రెడ్డి ఆమెను సస్పెండ్ చేస్తు మార్చి 16న ఉత్తర్యులు జారీచేశారు. ఆమెకు ఉత్తర్నులను అందజేసేందుకు 17 తారీకున ఆమె ఇంటికి వెళ్ళగా ఉత్తర్వులను తీసుకునేందుకు నిరాకరించారు. నిబంధనల ప్రకారం ఆర్ జేడీ సంతకం చేసిన 16వ తేదీ నుంచే సస్పెన్షన్ అమలులోకి వచ్చినట్లేనని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అనంతరం గత నెల 21న పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడు రాంచంద్రుకు ఇంచార్జ్ హెచ్ఎంగా డీఈవో బాధ్యతలను అప్పగించారు.

also read:-అర్చన శర్మ ఆత్మకు శాంతి చేకూరాలి

అయితే సస్పెన్షన్ కు గురైన ప్రమిళ ఈ నెల 24న పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు రాకముందే పాఠశాలకు వచ్చి,ప్రధానోపాధ్యాయుడి సీట్లో కుర్చోని 19, 21, 22, 23 తేదీ ల్లో CL వేసుకుని 24 న హాజరుపట్టికలో సంతకం చేశారు. డీఈవో, ఆర్ జేడీ ఆదేశాలను బేకాతారు చేస్తూ సస్పెన్షన్లో ఉన్న ఆమె దర్జాగా హెచ్ఎం కర్చీలో కూర్చొని, హాజరు పట్టికను వైట్ ఫ్లూయిడ్ తో తారుమారు చేసిందని స్థానిక ఉపాధ్యాయులు డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఈవో ఆదేశాల మేరకు కూసుమంచి ఎంఈవో వెంకటరామాచారి విచారణ జరపగా, వైట్నర్ తో సస్పెన్స్ కు సంబంధించిన సంతకాలను చెరిపినట్లు విచారణలో తేలింది. విచారణ జరిపి ఆమె తప్పులకు పాల్పడినట్టు తన నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేశారు. ఈమెపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.