Telugu News

నాకు నా పిల్లలకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించండి

బాధితురాలుల ధనావత్ ప్రియాంక

0

నాకు నా పిల్లలకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించండి

బాధితురాలుల ధనావత్ ప్రియాంక

(ఖమ్మం విజయం న్యూస్);-

నగరంలో స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాధితురాలు ధనావత్ ప్రియాంక మాట్లాడుతూ భాను ప్రకాష్ తో 14-06-2012వ సంవత్సరంలో వివాహం అయిందని అతను హైదరాబాద్ యశోద ఆస్పత్రిలోఎంబీబీఎస్ డాక్టర్ గా పని చేస్తున్నారని , ఒక సంవత్సరం వరకు మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఆ తరవాత అదనపు కట్నం కోసం శారీరకంగా , మానసికంగా హింసిస్తూ వేధిస్తున్నాడని , నాలుగు సంవత్సరాల క్రితం తను గర్భిణిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో తనను కొట్టి హింసించి ఇంటికి పంపించాడని , ఆ తర్వాత తనకు తెలియకుండా వేరే అమ్మాయితో సహజీవనం కొనసాగిస్తూ నాలుగు సంవత్సరాల పాటు తప్పించుకుని తిరిగాడని 11-02-2022 సూర్యాపేటలో ఉంటున్న విషయాన్ని తెలుసుకుని తమ పిల్లలతో ఇంటి వద్దకు వెళ్లగా వేరే అమ్మాయితో చూసి గొడవ చేశానని దీనిపై నేనే అతనిని అతడిపై దాడి చేసినట్టుగా సూర్యపేటలో పోలీస్స్టేషన్లో నాపై కేసు పెట్టించాడని , గతంలో కూడా పెద్దమనుషుల సమక్షంలో ఆరుసార్లు మాట్లాడి తీసుకుని వెళ్లాడని అయినా అతనిలో మార్పు రాలేదని , తిరిగి అదే పద్ధతిలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు .

also read :-లేడీ కిలాడీ చేతులొ మోసపోయిన వృద్ధురాలు

తనకు ఒక బాబు , ఒక పాప అని , ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం ప్రాంతంలో నివాసం ఉంటున్నారని , అతనితో పాటు వారి తండ్రి డి. వెంకటేశ్వర్లు , తల్లి ప్రమీల , అక్క మీనాక్షి , బావ శివప్రసాద్ వీరందరూ కలిసి తనను , తన పిల్లలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మానసికంగా హింసకు గురిచేస్తున్నారని అన్నారు . గతంలో ఆమెపై , పిల్లలపై హత్యాయత్నానికి ప్రయత్నించారు అని కావున మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా వారి నుండి తనకు , తమ పిల్లలకు రక్షణ కల్పించాలని మీడియా సమావేశంగా పోలీసు అధికారులను , మహిళా కమిషన్లను , మహిళా సంఘాలను , ప్రజాప్రతినిధులను వేడుకున్నారు . తమకు తమ పిల్లలకు ఏమి జరిగినా తన భర్త , అత్త , మామ , ఆడపడుచు , భావాలే పూర్తి బాధ్యత వహించాలని కోరారు . ప్రస్తుతం సూర్యపేటలో సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారని తెలిపారు .