Telugu News

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుభకృత్ నామ ఉగాది వేడుకలు

0

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుభకృత్ నామ ఉగాది వేడుకలు

పట్టణంలోని స్మార్ట్ కిడ్జ్

పాఠశాలలో శుభకృత్ నామ ఉగాది వేడుకలను చిన్నారులు ఘనంగా నిర్వహించారు.

(ఖమ్మం  విజయం న్యూస్):-

ఈ సందర్భంగా పాఠశాలలో వారు సాంప్రదాయ వస్త్ర వేషధారణ తో నూతన తెలుగు సంవత్సరాది కి స్వాగతం పలికారు.ముందుగా లక్ష్మీదేవి, సరస్వతి దేవి కి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి ని ఒకరికొకరు తినిపించుకొని పులుపు,తీపి,వగరు కారం, చేదు,ఉప్పు,షడ్రుచుల మిశ్రమమే ఉగాది పండుగ అని , శ్రీ శుభ కృత్ నామ సంవత్సరంలో నూతన విద్యా సంవత్సరానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా శుభంతో ముందుకు నడవాలని సరస్వతి దేవిని కోరుకున్నారు.

also read :-దేశాన్ని అమ్ముతున్న మోడీ షాలు

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ శుభకృత్ నామ ఉగాది సంవత్సరం లో ఎటువంటి విఘ్నాలు లేకుండా విద్యార్థుల చదువు సాఫీగా సాగిపోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.