Telugu News

గుడుంబా ప్యాకెట్ల పట్టివేత

రామగిరి,విజయం న్యూస్

0

గుడుంబా ప్యాకెట్ల పట్టివేత

(రామగిరి,విజయం న్యూస్):-

బుదవారం ఏక్సైజ్ పోలీసులు మండలంలోని బేగంపేట్ గ్రామంలో దాడులు నిర్వహించి గుడుంబా ప్యాకెట్లను పట్టుకున్నారు. బేగంపేట్ గ్రామంలో ఏక్సైజ్ సీఐ జి.గురువయ్యా తన సిబ్బంది ఎస్ఐ సాయిరాం తో కలిసి దాడులు నిర్వహించగా గ్రామంలోని బోంతల వాడలో బొంతల చంద్రకళ (38) అనే మహిళ ఇంట్లో ఐదు లీటర్ల గుడుంబా ప్యాకెట్లు దొరికినట్లు తెలిపారు.

గుడుంబా ప్యాకెట్లను విక్రయించడం చట్ట రీత్యా నేరమని, అందుకు శిక్షార్హుులు అవుతరని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏక్సైజ్ కానిస్టేబుల్స్ రాజేందర్, రాజ్ కుమార్, హరీష్ పాల్గొన్నారు.