Telugu News

చింతకాయలు కోయబోయి.. కిందపడి.. చనిపోయిడు

ఖమ్మంరూరల్-విజయంన్యూస్

0

చింతకాయలు కోయబోయి.. కిందపడి.. చనిపోయిడు
(ఖమ్మంరూరల్-విజయంన్యూస్)
చింతకాయలు రాల్చేందుకు చెట్టేక్కిన ఓవ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి కిండపడిపోవడంతో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మతిచెందిన సంఘటన సోమవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామానికి చెందిన బరిగల వెంకటేశ్వర్లు(39) తన ఇంట్లో ఉన్న చింతచెట్టుకు చింతకాయలు రాల్చేందుకు ఈనెల 17న చెట్టేక్కి రాల్చుతున్నాడు.

also read :-రాజన్న సిరిసిల్ల జిల్లా… సిరిసిల్ల అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం.

కాగా ప్రమాదవశాత్తు కాలు జారీ చెట్టుపై నుంచి కిందపడిపోవడంతో ఆయనకు తీవ్రగాయాలైయ్యాయి. దీంతో తక్షణమే ఖమ్మం ప్రభుత్వాసుత్రికి తరలించగా ఆదివారం అర్థరాత్రి 11గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లు అంత్యక్రియలు కార్యక్రమంలో తల్లంపాడు మాజీ సర్పంచి బరిగెల రాంమూర్తి, సోమనబోయిన సత్యనారాయణ, బారి విజయ్ కుమార్,ఆవుల వలరాజు, వల్లాల రాంబాబు, సూర్యనారాయణ,బోళ్ళ బ్రదర్స్,బారి బ్రదర్స్,సంకబుడ్డి బ్రదర్స్, బరిగెల బ్రదర్స్,కాటిరేకుల బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.