Telugu News

ఆంగ్ల మాధ్యమాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేద్దాం*.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ను స్వాగతిస్తున్నాం

0

ఆంగ్ల మాధ్యమాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేద్దాం*.

** ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ను స్వాగతిస్తున్నాం

** పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు మోతుకూరి మధు

(కూసుమంచి-విజయంన్యూస్);-

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని,ఈ అవకాశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు అందిపుచ్చుకుని ప్రభుత్వ పాఠశాలలను మరింతగా బలోపేతం చేద్దామని పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు మోతుకూరి మధు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కూసుమంచి మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న (ఈఎల్ఈసీ) ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు మూడో స్పెల్ శిక్షణా తరగతులకు హాజరై ప్రసంగించారు.

also read :-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

వేసవిలో ఉపాధ్యాయ ప్రమోషన్స్,బదిలీలు జరుగుతాయని వేలాది మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు రాబోతున్నట్లు పేర్కొన్నారు.ఉపాధ్యాయ పరస్పర బదిలీలపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని త్వరలోనే బదిలీల ఆర్డర్స్ వస్తాయని,స్పౌజ్ ల విషయంలో కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మధు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వై. వెంకటేశ్వర్లు,రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు టి.జయమ్మ, కూసుమంచి మండల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు పి. నాగేశ్వరావు, యస్.ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి సాదే.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు జి. వి.రమణ ,టి.శోభన్ బాబు,బి. సంజీవరావు,అజ్మీరా.సోమ్లా పాల్గొన్నారు