“లోక్యతండా” లో కామదాహనం
== మూడు రోజుల వేడుకలో భాగంగా రెండవ రోజు ఈ వేడుక
== తొలి రోజు కోలాటం.. ప్రారంభించిన ఎమ్మెల్యే కందాళ
== నేడు 10.30నుంచి ఢూండ్
== రేపు రంగోలీ..
(కూసుమంచి-విజయంన్యూస్);-
లోక్యతండాలో హోలీ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వందేళ్ల నుంచి కుల ఆచారంగా వస్తున్న ఈ పండుగ సంబరాన్ని ఈ ఏడాది కూడా గిరిజనులు జరుపుకుంటున్నారు. లోక్యతండా పరిధిలోని లోక్యతండా, జగ్మల్ తండా, కొత్తతండాలకు చెందిన గిరిజనులు ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు రోజలు పాటు ఈ వేడుకల్లో చిన్నా,పెద్దా అంతా కలిసి ఆనందోత్సహాల్లో జరుపుకుంటుండగా, మొదటి రోజు కోలాటం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.
also read;-భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడు
శనివారం కామదాహనం కార్యక్రమాన్ని గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఎంపీటీసీ జర్పుల బాలాజీ నాయక్, మాజీ జడ్పీటీసీ వడ్తియా రాంచంద్రునాయక్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రమేష్ నాయక్, మోతిలాల్ నాయక్,రాజునాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 7గంటల నుంచి ఈ కామదాహన కార్యక్రమం ప్రారంభం కాగా తండాలోని ప్రతిఇంటి వద్ద నుంచి ఒక కట్టెను తీసుకొచ్చి కామదాహనం స్థలంలో పేర్చారు.
అనంతరం తెల్లవారుజామున 5గంటలకు కుల పెద్దలు గేరియా, కారోబారో లు వచ్చి పూజలు చేశారు. అనంతరం కామదాహనం చేసి ఆ మంటల చుట్టు తిరుగుతూ సందడి చేశారు. ఆటపాటలతో సందడి చేశారు.. యువకులు చర్రా అంటూ కేరింతలు కొడతూ సందడి చేశారు. కామదాహనం అనంతరం అక్కడ బూడిదను బొట్టుగా స్వీకరించారు. అనంతరం పెళ్లికానీ యువత కులపెద్దల వద్దకు వచ్చి ఆశీర్వదం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వందలాధి మంది జనం తరలివస్తారు.