Telugu News

ధర్మతండాలో వైభవంగా శ్రీ గోపయ్య,లక్ష్మితిరుపతమ్మ కల్యాణం

= పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు

0

ధర్మతండాలో వైభవంగా శ్రీ గోపయ్య,లక్ష్మితిరుపతమ్మ కల్యాణం
== పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
(కూసుమంచి-విజయంన్యూస్);-
కూసుమంచి మండలంలోని ధర్మతండా గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ లక్మి తిరుపతమ్మ-గోపయ్య స్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగవైభవంగా జరిగింది. ఆయల కమిటి చైర్మన్ గుగులోతు లక్ష్మణ్, వైస్ చైర్మన్ చెరుకుపల్లి వీరయ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు చిలకమర్రి స్వామినాథ్, రంగబాలాజీ ఆధ్వర్యంలో స్వామివారి తిరుకల్యాణ వేడుకలను ఘనంగా జరిపించారు.

also read;-డ్యాన్స్ చేసిన ఖమ్మం పోలీస్ కమీషనర్

ఈ కల్యాణ వేడుకలను భక్తులు కనులారా తిలకించారు. కూసుమంచి మండలంతో పాటు ఖమ్మం, సూర్యపేట, మహుబూబాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జర్పుల భిఖ్య, జె నాగేశ్వరరావు, వి. లచ్చిరామ్, వి. శంకర్, భద్రు.వీరన్న, తారచందు, జే. బాలాజీ, ధర్మతండా గ్రామ సర్పంచ్ జర్పుల.పింప్లీ బిక్ష్మం నాయక్, గ్రామ ఉప సర్పంచ్ జర్పుల కళావతిరవికుమార్, వార్డ్ మెంబెర్స్, గ్రామ పెద్దలు కృష్ణ, ,వీరన్న, కోటియా, రవికుమార్, సుమన్, చంద్, ప్రసాద్, నారాయణ, హనుమ, వెంకన్న, సీతారాములు, నాగేశ్వరరావు, కుమార్, రమేష్, కిషన్, సోనేస్వరావు, రామోజీ, రాము, మదర్, పూలసింగ్, చిరంజీవి, సురేష్, వెంకన్న,తులసిరామ్, పరాశరాము, సురేష్, ఉపేందర్, శంకర్, ధర్మ, హీరామను, శివ, రాములు, నాగేశ్వరరావు పాల్గొన్నారు