Telugu News

టేకులతండాలో భారీ అగ్ని ప్రమాదం

*సుమారు రూ. 3 లక్షల మేరకు నష్టం

0

టేకులతండాలో భారీ అగ్ని ప్రమాదం

*సుమారు రూ. 3 లక్షల మేరకు నష్టం

*ఆర్థిక సహాయం అందించిన జడ్పిటిసి 
సభ్యులు బానోత్ వెంకట ప్రవీణ్ కుమార్.

(కామేపల్లి – విజయం న్యూస్);-

కామేపల్లి మండలం టేకులతండా గ్రామంలో  మంగళవారం
రాత్రి 11 గంటల సమయంలో భారీ
అగ్ని ప్రమాదం సంభవించిం
ది.సుమారు రూ. 3 లక్షల మేరకు వాటిల్లింది. ఈ సంఘటనకు సంబంధించిన స్థానికుల కథనం మేరకు
వివరాలు టేకుల తండా గ్రామంలోని భూక్య రాములు నివాస గృహానికి రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించి నివాసగృహం పూర్తిగా దగ్ధమయింది. రాత్రి నిద్రించే సమయం కావడంతో మంటలు ఇంట్లో వాళ్ళు తేరుకునేలోపే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో గ్రామస్తులు
అదుపు చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండటంతో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం దగ్ధమయ్యాయి.

also read :-ఘనంగా టీఆర్ఎస్, పార్టీ, 21, వ, ఆవిర్భావ దినోత్సవం,

ఇంటిని ఆనుకొని కట్టి ఉన్న మూగజీవాలైన గొర్రెలు, మేకలు, కోళ్లు, రెండు ద్విచక్ర వాహనాలు.వీటితో పాటు పదివేల రూపాయలు అగ్గి పాలయ్యాయని తెలిపారు. ఈ సంఘటనతో పూర్తిగా నిరాశ్రయులైన గిరిజన కుటుంబం వీధిన పడ్డారు. సమాచారం తెలుసుకున్న
కామేపల్లి మండల కాంగ్రెస్  కమిటీ నాయకులు జడ్పిటిసి సభ్యులు బానోత్ వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి వర్కింగ్,ప్రెసిడెంట్ దమ్మాలపాటి సత్యనారాయణ, స్థానిక ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, స్థానిక సర్పంచ్ లకావత్ సునీత, వార్డు సభ్యులు నల్లమోతు వెంకట నరసయ్య లు నిరాశ్రయులైన కుటుంబాన్ని ఘటనా స్థలాన్ని సందర్శించి

also read :-దళిత బంధు అమలు చారిత్రాత్మక నిర్ణయం.
నిరాశ్రయులైన కుటుంబాన్ని
పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. బాదిత కుటుంబానికి జెడ్పిటిసి  బానోత్ వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్ స్పందించి
రూ. 5000 నగదు ఆర్థిక సహాయం అందింజేసారు. నిరాశ్రయులైన
కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకు క