Telugu News

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు.

ఏన్కూరు విజయ్ న్యూస్

0

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు.

(ఏన్కూరు విజయ్ న్యూస్):-

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని బి ఆర్ పురం, తిమ్మారావుపేట,రంగాపురం, ఏనుకూరు రేపల్లెవాడ గ్రామాల్లోని పాఠశాలలను డి ఈ ఓ సందర్శించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఉన్న సౌకర్యాలు లేని సౌకర్యాలు గురించి వివరాలు తీసుకున్నారు. తిమ్మారావుపేట హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు జరుగుతున్న ఫ్రీ ఫైనల్ పరీక్షలను పరిశీలించారు.

also read :-ఉచిత వైద్య సేవలు మరింత ఆరోగ్యాన్ని కాపాడతాయి

అనంతరం డి ఈ ఓ విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో టాయిలెట్లు భవనాల మరమ్మతులు కరెంట్ సౌకర్యం తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లాలో 104 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని 17 వేల 500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు అని డీఈవో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయరాజు పాల్గొన్నారు.