Telugu News

12న బొమ్మలో జాతీయ స్థాయి ఫెస్ట్..

* 13న కళాశాల వార్షికోత్సవం

0

12న బొమ్మలో జాతీయ స్థాయి ఫెస్ట్..

** 13న కళాశాల వార్షికోత్సవం

** ఫెస్ట్ కు కలెక్టర్ గౌతమ్ , అడిషనల్ డీసీపీ ఏఎస్ బోస్

**-వార్షికోత్సవానికి సీపీ విష్ణువారియర్, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ రావు ,

** విలేకరుల సమావేశంలో చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు

(ఖమ్మం ఎడ్యూకేషన్-విజయంన్యూస్)
ఖమ్మం నగరంలోని బొమ్మ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ లో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ కార్యక్రమంతో పాటు, బుధవారం కళాశాలల వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు బొమ్మ విద్యాసంస్థల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు తెలిపారు. బొమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ , ఫార్మసీ , ఇన్ఫర్మ్యాటిక్స్ , డిప్లొమా అన్ని కోర్సులకు బోమ్మ ప్రీమియర్ లీగ్ ( బీపీఎల్ ) -2022 , బొమ్మైన్స్ -22 పేరుతో ఈ సాంకేతిక , సాంస్కృతిక ఉత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

also read :-సాయిబాబా ఆలయంలో భట్టి దంపతుల పూజలు

12 న జరిగే ప్రారంభానికి ముఖ్య అతిధులుగా కలెక్టర్ గౌతమ్, అడిషనల్ డీసీపీ ఏఎస్ బోస్ పాల్గోనున్నట్లు పేర్కొన్నారు. 13 న జరిగే కళాశాల వార్షికోత్సవ వేడుకలకు సీపీ విష్ణువారియర్ , అడిషనల్ కలెక్టర్ మధుసూదన్రావు హజరుకానున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఫెస్ట్కు వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే 500 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. పేపరు, పోస్టర్ ప్రజెంటేషన్ టెక్నికల్ క్విజ్ , లైవ్ మోడల్స్ వంటి పలు అంశాల్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ . 3 లక్షల వరకు నగదు బహుమతిని అందించనున్నట్లు పేర్కోన్నారు. ఈ సమావేశంలో బొమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ బొమ్మ సత్య ప్రసాద్ , కార్యదర్శి శ్రీధర్ , ప్రిన్సిపాల్స్ , వివిధ విభాగాల అధిపతులు పాల్గోన్నారు .