Telugu News

నేటి నుంచి ధాన్యం కొనుగోలు షూరు

==ఖమ్మం జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

0

నేటి నుంచి ధాన్యం కొనుగోలు షూరు

===ఖమ్మం జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

===1,70,595 మెట్రిక్ టన్నుల కొనుగోలే లక్ష్యం

===అన్ని మండలాల్లోకేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం

(విజయం న్యూస్  ఖమ్మం):-

గతేడాదిలాగే జరుగుతుందా..? మిలర్ల కేటాంపు సంగతేంటి..? (ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)రైతులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రైతులు సాగు చేసినయాసంగి పంట వరి ధాన్యం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ మంగళవారంప్రకటించారు. ఈ మేరకు తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ఆదేశించడంతో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకుసంబందిత అధికారులు సిద్దమైయ్యారు.

also read :-డిజిటల్ గ్రీన్ ఎన్జీవో సంస్థ యాఫ్ తో చీడపీడల నివారణ

జిల్లాలో యాసంగి సీజన్ లో రైతులు వరి పంటనుఎన్ని ఎకరాల్లో పండించారు. ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. ఎన్నిబస్తాలు అవసరం ఉంటాయి.. ఎన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనే అంశంపై సంబంధితఅధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ ను జిల్లా కలెక్టర్వి.పి.గౌతమ్ కు అందజేయగా, ఆయన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అందజేశారు. కాగా  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఖమ్మం జిల్లా అధికారులతోసమీక్ష సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం ప్రతి గింజను కొనుగోలు చేయాలని, అందుకుగాను సంబంధిత అధికారులు సంసిద్దం కావాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 14 వ తేదీ గురువారం (నేటి) నుండే యాసంగిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడఅజయ్ కుమార్ స్పష్టం చేశారు.  రైతులేవ్వరుతక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవద్దని, కచ్చితంగా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలుచేస్తుందన్నారు.

also read :-చిత ఆన్లైన్ వేసవి వర్క్ షాప్ తో ప్రాక్టికల్లీ వద్ద హాలీడే వినోదం తిరిగి వస్తుంది

జిల్లాలో 236 కేంద్రాలు ఏర్పాటు యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఖమ్మం జిల్లా అధికారులుసర్వం సిద్దమైయ్యారు. జిల్లాలో మొత్తం 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనినిర్ణయించారు. మండలానికి సుమారు 3 నుంచి 5 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఎన్ఎస్ పీ ప్రాంతాల్లో మరికొన్ని ఎక్కువగానే కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసేందుకు  సంబంధితఅధికారులు చెబుతున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో యాసంగి పంట కాలానికి గాను 1,05,607 ఎకరాలలో వరిసాగు జరిగిందని, 2,42,896 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడివచ్చే అవకాశం ఉందని అధికారలు అంచనా వేస్తున్నారు. అయితే అందులో 1,70,595మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

also read;-భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం

మిగిలిన ధాన్యంను రైతులు నిల్వ చేసుకోవడం, విత్తనాల కోసం విక్రయించడం, అలాగే బయటవ్యాపారులకు విక్రయించడం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే అందుకు గానుజిల్లాలో 236 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధికారులు  తెలిపారు. కాగా వాటికి సంబంధించిన ధాన్యంకొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు, గన్నీ బ్యాగులు సమకూర్చుకొనుట, తేమశాతం నిర్ధారణ పరికరాలు, తూకం మిషన్లు తూర్పారబట్టేయంత్రాలు టార్పాలిన్లు తదితర అవసరాల ఏర్పాట్లతో పాటు వేసవి దృష్ట్యా కొనుగోలుకేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు అవసరమైన కనీస వసతులు త్రాగునీరు, షామియానా వంటి వసతులను సమకూర్చేందుకుఅధికారులు కసర్తత్తు చేస్తున్నారు.

షూరు అయిన వరికోతలుఖమ్మం జిల్లాలో యాసంగి పంట వరికోతలు ఇప్పటికే ప్రారంభమైయ్యాయి.ఎన్ఎస్ పీ ప్రాంతాల్లో ఇప్పటికే వరికోతలు ప్రారంభమైయ్యి తక్కువ ధరలకు విక్రయాలుచేసుకున్న రైతులు ఉన్నారు. ముఖ్యంగా  పాలేరు, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలలోని కూసుమంచి, కల్లూరు, సత్తుపల్లి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, ఏన్కూరు, తల్లాడ మండలాలలో వరికోతలుప్రారంభం కాగా చాలా మంది రైతులు ధాన్యంను విక్రయాలు చేసుకున్నారు. ఎక్కువ శాతంమంది రైతులు ధాన్యం నిల్వ చేసుకున్నారు. ఇక చెరువులు, బోర్లు, బావుల కిందా సాగుచేసిన రైతులకు సంబంధించిన వరి పంట ను వరికోతలు ఇప్పుడిప్పుడ ప్రారంభమయ్యే అవకాశంఉంది.

also read :-బార్ ,రెస్టారెంట్‌లో క్రికెట్ బెట్టింగ్‌

లారీలు వస్తాయా..? మిల్లర్లుకేటాయిస్తారా..? ఈ ఏడాది వానకాల సీజన్ లో వరిపండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిల్లర్లు సహాకరించక, లారీలు రాకా,కొనుగోలు చేసిన ధాన్యం లోడ్ చేయక, కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం నీటిపాలైంది.అలాగే మిల్లర్లకు వెళ్లిన ధాన్యం కోతకోయడం లాంటి సంఘటనల వల్ల రైతులు తీవ్రంగానష్టపోయారు. 40 నుంచి 50 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిలిచిపోయాయి.కొనే నాథుడే కరువైయ్యారు. అయితే వద్దు వద్దు అనుకుంటూనే.. కొనలేము.. కొనబోముఅనుకుంటూనే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్, తెలంగాణప్రభుత్వం గ్రౌండ్ లెవల్ కు వచ్చేసరికి సీఎం ఆదేశాలు అమలు అవుతాయా..? అని రైతులుసందేహ పడుతున్నారు.

లారీలు, మిల్లర్ల కేటాయింపుజరిగిందా..? కొనుగోలు కేంద్రాలనుప్రారంభించేకంటే ముందుగా జిల్లా అధికారులు మిల్లర్లు కేటాయించాలి, అనంతరం లారీలనుఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకుప్రభుత్వం ఆదేశాలిచ్చిందే తప్ప, మిల్లర్లకు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకుఅధికారులకు అందలేదు. పైగా లారీల సంగతి ఇంకా ముందుకే సాగలేదు. మిల్లర్లనుకేటాయించకపోతే లారీలను కేటాయించిన ఫలితం ఉండదు. కొనుగోలు చేసిన ధాన్యంను లోడ్చేసేందుకు రోజుల తరబడి ఆలస్యం కావోచ్చు. అందుకే ప్రభుత్వాధికారులు ముందుగామిల్లర్లను కేటాయించుకోవాలని రైతులు కొరుతున్నారు. చూద్దాం అధికారులు ఏంచేస్తారో..?