Telugu News

గణపేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన జనం

వేలాధి మంది తరలివచ్చిన భక్తులు

0

గణపేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన జనం
== వేలాధి మంది తరలివచ్చిన భక్తులు
== భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణి
== భారీగా ఏర్పాట్లు చేసిన పంచాయతీ, దేవదాయశాఖ
== దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పొంగులేటి, ఎమ్మెల్సీ, గాయత్రి రవి
(కూసుమంచి-విజయంన్యూస్)
కాకతీయుల కళాదర్పణం, గణపతిమహారాజు నిర్మాణం చేసిన పురాతన దేవాలయం కూసుమంచి శివాలయం(గణపేశ్వరాలయం) మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులతో పోటేత్తింది.. వేలాధి మంది భక్తులు తరలివచ్చి శివున్ని దర్శించుకున్నారు. అసియఖండంలోనే అతిపెద్ద శివలింగంగా పేరుగాంచిన కూసుమంచి శివాలయంను వేలాధి మంది భక్తులు తరలివచ్చి పూజలు చేశారు.

also read :-కొంచెం సృజనాత్మకతతో ఆలోచించండి

దీంతో గణపేశ్వరుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రముఖులు పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మంగళవారం మహశివరాత్రి పర్వదినం సందర్భంగా కూసుమంచి శివాలయంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాతరను తలపించిన ఈ ఉత్సవాలను సర్పంచ్ చెన్నామోహన్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, దేవాలయ ఈవో శ్రీకాంత్, ఆయల అర్చకుడు దేవలపల్లి శేషగిరిశర్మ, ఆలయ పున:నిర్మాణ కర్త రిటైర్డ్ డీసీపీ సాధువీరప్రతాఫ్ రెడ్డి గత వారం రోజుల నుంచే ప్రత్యేకంగా చొరవ తీసుకుని భారీగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీగా టెంట్లు వేసి ఎండ తీవ్రత తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అలాగే భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని భావించిన వారు భారీకేట్లు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టగా కూసుమంచి సీఐ సతీస్, ఎస్ఐ నందీఫ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది టికెట్లను పంపిణి చేశారు. అలాగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా 41 రోజుల ముందుగానే సుమారు 100 మంది భక్తులు శివమాల ధరించారు. కాగా వారు శివరాత్రి పర్వదినం సందర్భంగా వచ్చిన భక్తులకు సేవకార్యక్రమాలను అందజేశారు.
== తెల్లవారుజాము నుంచే అభిషేకాలు
కూసుమంచి శివాలయంలో మంగళవారం తెల్లవారుజామున 2గంటల నుంచే పూజా కార్యక్రమాలను పూజారులు ప్రారంభించారు. ప్రధానార్ఛకుడు శేషగిరిశర్మ ఆధ్వర్యంలో 2గంటలకు సంపూర్ణాభిషేకం చేశారు. సుమారు 144 లీటర్ల పాలు, 144 లీటర్ల పెరుగు, జ్యూస్, నెయ్యి,పసుపు, కుంకుమ తదితర 9 రకాల అభిషేకాలు చేశారు. భక్తులు అభిషేకం చేయించుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, భక్తులు అభిషేకాలు చేయించుకున్నారు.

also read :-శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం..
== వేలాధిగా తరలివచ్చిన భక్తజనం
కూసుమంచి శివాలయానికి వేలాధి మంది భక్తులు తరలివచ్చారు. కూసుమంచి మండలంతో పాటు ఖమ్మం, మహుబూబాద్, సూర్యపేట జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రిష్ణా జిల్లా నుంచి బారీగా భక్తులు తరలివచ్చారు. సుమారు లక్షన్నర వరకు భక్తులు రావడంతో కూసుమంచి శివక్షేత్రం భక్తులతో పొటేత్తింది. భారీగా జనం రావడంతో ఒకానోక దశలో అధికారులు, పోలీసులు, భక్త ఉత్సవ కమిటీ సభ్యులు చేతులేత్తే పరిస్థితికి వచ్చింది. అయినప్పటికి సీఐ సతీస్ ఆధ్వర్యంలో టీమ్ వర్క్ తో భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కల్గినప్పటికి అందరికి దర్శనం అందేలా చర్యలు తీసుకున్నారు. ఎండతీవ్రత అధికంగా ఉండటంతో పులిహోరాతో పాటు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను అందజేశారు. అలాగే భక్తులు ప్రత్యేకంగా స్నానాలు చేసేందుకు గంగాదేవి చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
== పలువురు పూజలు
కూసుమంచి శివాలయంలో పలువురు ప్రముఖులు పూజలు చేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, విజయమ్మ దంపతులు, ఎమ్మెల్సీ తాతామధు, ప్రత్యేకంగా పూజలు చేశారు. అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గాయత్రి రవి ప్రత్యేకంగా పూజలు చేశారు. వారు దేవాలయానికి చేరుకోగా ఆలయ అర్చకులు, దేవదాయశాఖాధికారులు, సర్పంచ్, ఎంపీటీసీతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంబంతో దేవాలయానికి సాధారంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం దేవాలయ అవరణంలో అతిథులకు దేవదాయశాఖాధికారులు ఘనంగా సన్మానించి దేవాలయ ప్రసాదాలను అందజేశారు.