Telugu News

నువ్వు బత్తాయివో.. వంకాయవో.. ప్రజలకు తెలుసు..

వ్యక్తిగత ఆరోపణలతో ఖమ్మం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.

0

నువ్వు బత్తాయివో.. వంకాయవో.. ప్రజలకు తెలుసు..

▪️వ్యక్తిగత ఆరోపణలతో ఖమ్మం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.

▪️కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకుని ఆ కోటాలో ఎంపి అయింది రేణుక చౌదరి.

▪️చెయ్యడం చాతకాదు.. చేసే వారిని చేయ్యనియ్యరు.

▪️అవగాహన రాహిత్యంతో మాట్లాడి అబాసు పాలు కావడం తప్పదు బండి.

▪️విలేకరుల సమావేశంలో కమ్మ కార్పొరేటర్స్ బండి, రేణుక, రేవంత్ పై ధ్వజం..

విలేకరుల సమావేశంలో వక్తలు మాట్లడుతూ..

(ఖమ్మం విజయం న్యూస్ );-

అతి తక్కువ సమయంలో ఖమ్మంలో ఇంత అభివృధ్ధి అంటే అషా మాషి కాదు.. అందుకు దృడ సంకల్పం కావాలి. చిన్న ఘటనను సాకుగా చూపి స్వార్థం కోసం వాడుకుంటుంది బిజేపి..ఖమ్మంలో కులాలకు, మతాలకు అతీతంగా అనేక పండగలు, వేడుకలు చాలా ప్రశాంతంగా ప్రజలు జరుపుకుంటున్నారు.పచ్చగా ఉన్న ఖమ్మంలో సాయి అనే యువకుడి మరణాన్ని కాంగ్రెస్, బిజేపి పార్టిలు రాజకీయానికి వాడుకోవడం విచారకరం. ఎన్నడు లేని విధంగా శవ రాజకీయాలకు తెరలేపి మంత్రి పువ్వడ మీదకు నెట్టి చోద్యం చూస్తున్నారు.

also read :-ఖమ్మం అభివృద్ధి ప్రదాత మంత్రి పువ్వాడ అజయ్ పై ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కుట్ర..

మంత్రి పువ్వాడ మీద అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు బండి సంజయ్… అయ్య.. బండి నువ్వు బత్తాయి వో.. వంకాయవో.. నాకు తెలియదు..నువ్వు తంబాకు తింటావో.. అంబర్ తింటావో మాకు అనవసరం.. సంబంధం లేకుండా వ్యక్తిగత దాడి చేయడమే మీ ఎజెండా అయితే మా సత్తా కూడా మీకు చూపించాల్సి వస్తుంది.ఖమ్మం కు ఏం చేశావని అంటున్నావ్ రేణుక… నువ్వేం చేశావో చెప్పు ఖమ్మంకు. పదేళ్లు ఖమ్మం లో ఎంపిగా ఉన్నావు ఏం చేశావో ఒక్కటి చెప్పు..

నీది ఇక్కడ కాదు.. రాజమండ్రీ నుండి వచ్చావు.. ఖమ్మం స్థితిగతులు, భౌగోళిక పరిధిలు తెలియదు.. అయినా ఖమ్మం ప్రజలు నిన్ను ఆదరిస్తే.. ఇక్కడి ప్రజలపై విమర్శలు గుప్పిస్తున్నారు..వైరాలో నిర్వహించిన కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ కమ్మ కులం గురించి మాట్లాడితే… ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు కమ్మ కులం ఆని వ్యాఖ్యానిస్తున్నారు….?కమ్మ సంఘం భవనంలో కమ్మ కుల వేదిక సమావేశంలో కులం గురించి మాట్లాడుకుంటే మరేం మాట్లాడతారో నువ్వే చెప్పాలి…?

also read :-సామాన్యులకు షాక్.. మరోసారి పెరగనున్న వంటనూనెల ధరలు..!!

అసలు నువ్వేం చేశావో చెప్పు.. ఏనాడైనా ఖమ్మంలో ఉన్నావా.. ఖమ్మంకు ముఖ్య అతిధి వచ్చినట్లు వస్తావు.. మళ్ళీ కనబడవు…ఖమ్మం అభివృధ్ధి ని అడ్డుకోవాలని ఒకే ఒక ఎజెండాతో సాయి గణేష్ మృతిని మీ పార్టీ కొసం, స్వాలాభం కొసం వాడుకోవడం సిగ్గుచేటు.. కమ్మ కులాన్ని వాడుకుని, ఆ కోటాలో ఎంపీ అయ్యింది ఎవరమ్మ రేణుకమ్మ.. కొంచమైనా సిగ్గుండలి. కులాన్ని ఇప్పటివరకు నువ్వు వడుకున్నంత ఎవరు వాడలేదు.పైగా మంత్రి పువ్వాడ పై కులాన్ని అంటగట్టి నిందలు వేస్తున్నావ్..

ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేయడం.. దాన్ని కులానికి మతానికి ఆపాదించడం మీకే చెల్లుబాటు అవుతుందన్నారు.రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు, కారుకూతలు కాదు నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. నిరాధారమైన ఆరోపణలు చేసే ముందు సరి చూసుకొని మాట్లాడితే నీకు, నీ పదవికి గౌరవంగా ఉంటుంది..రాజకీయంగా ఎదుర్కోలేకనే దొడ్డిదారిన మెడికల్ కాలేజీకి తెరమీదకు తెస్తున్నవా రేవంత్..? కొద్దిగైనా సిగ్గుండాలి.

also read :-రఘునాథపాలెం మండల టిఆర్ఎస్ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం

అర్దరహితంగా ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు.. దమ్ముంటే ఖమ్మం రా మంత్రి పువ్వాడ చేసిన అభివృద్ది చూపిస్తా.కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా, మేయర్ పునుకొల్లు నీరజ, రావూరి కరుణ, మందడపు లక్ష్మి, చిరుమామిళ్ళ లక్ష్మి, పైడిపల్లి రోహిణి, మోతారపు శ్రావణి, పగడాల శ్రీవిద్య, సారిపుడి రమాదేవి, నాగండ్ల కోటి, మాజీ కార్పొరేటర్లు మందడపు మనోహర్, చావా నారాయణ రావు, నాయకులు జస్వంత్, పొట్ల వీరేందర్, సతీష్, ప్రసాద్, రాంమోహన్, బెనర్జీ తదితరులు ఉన్నారు..