Telugu News

ఎపెక్స్‌ లో అరుదైన శస్ర్త చికిత్స

10సెంటీ మీటర్ల మొఖంపుల్లను కడుపులోంచి తొలగింపు

0

ఎపెక్స్‌ లో అరుదైన శస్ర్త చికిత్స
– 10సెంటీ మీటర్ల మొఖంపుల్లను కడుపులోంచి తొలగింపు
– నలుగురు వైద్యుల సహాయంతో విజయవంతం
– విలేఖరుల సమావేశంలో వైద్యులు కె కిషోర్‌కుమార్‌ రెడ్డి, టి అర్జున్‌సింగ్‌
(ఖమ్మం-విజయంన్యూస్)
పది సెంటిమీటర్ల మొఖం పుల్లను జార మింగిన వ్యక్తి నుండి ఎపెక్స్‌ మల్టిస్పెషాలిటి ఆసుపత్రిలో నలుగురు వైద్యులు అత్యవసర పరిస్థితిలో 20నిమిషాల పాటు శ్రమించి రిస్క్‌ అయినప్పటికీ 10సెంటీమీటర్ల పుల్లను తొలగించారు. శనివారం స్థానిక ఎపెక్స్‌ మల్టిస్పెషాలిటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ కె కిషోర్‌కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ టి అరున్‌సింగ్‌, డాక్టర్‌ విజయ్‌చౌహాన్‌, డాక్టర్ శశి జంజిరాల మాట్లాడుతూ.. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పర్సగాని ఆదినారాయణ(44) ఉదయం ఎప్పటిలాగానే మొఖంపుల్ల వేసుకొని నములుకుంటూ మింగేశాడు.

also read :-China: చైనాలో 3 కోట్ల మంది లాక్‌డౌన్‌ లోకి

ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆదినారాయణను హుటాహుటినా ఆసుపత్రిలో చేర్చుకొని స్కానింగ్‌ నిర్వహించినప్పుడు అన్నవాహికకు కడుపులోకి చొచ్చుకొని ఉన్న 10సెంటీమీటర్ల పుల్లను గుర్తించామన్నారు. పేషెంట్‌కు ఎటివంటి అపాయంలేకుండా అత్యంత జాగ్రత్తగా ఎండోస్కోపి ద్వారా శస్ర్త చికిత్స నిర్వహించి పుల్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. రిస్క్‌ ఎందుకులే అని పేషెంట్‌ను శత్రచికిత్స కోసం హైదరాబాద్‌కు పంపిస్తే 50వేలు నుండి లక్ష రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉండేది కానీ ఎటువంటి రుసుము వసూళ్ళు చేయకుండా చికిత్స నిర్వహించామని తెలిపారు.

also read :-కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంకు పైసా వసూల్

పేషెంట్‌, అతని కుటుంబ సభ్యులు, బందువులు కృతజ్ఞతలు తెలిపారన్నారు. మా ఆసుపత్రిలో యూరాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, క్యాన్సర్‌కు సంబందించిన ఎటువంటి వ్యాధులకైనా తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని తెలిపారు. ఆ కార్యక్రమంలో ఆసుపత్రి మార్కెటింగ్‌ మేనేజర్‌ కొరిపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. మా

వేసవి జాగ్రత్తలు, కరోనా నిబంధనలు పాటించండి ఆరోగ్యంగా ఉండండి.

అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలో మార్పులు చోటుచేసుకొని అనారోగ్య పాలుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 3లీటర్ల నీరు తాగుతూ మద్య మద్యలో మజ్జిగ, నిమ్మరసం తీసుకోవడం వలన సీజనల్‌ వ్యాధులు ప్రభలే అవకాశం ఉండదన్నారు. గంటపాటు ఎండలో తిరగొద్దన్నారు. బయటకు వెళ్ళినప్పుడు కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని తెలిపారు.