*ఈదురు గాలులకు నెలకొరిగిన వరి పంట*
(దస్తురాబాద్-విజయం న్యూస్);-
మండల కేంద్రంలోని రాంపూర్ గ్రామంలో రాత్రి ఈదురు గాలులు, అకాల వర్షం వల్ల నెలకొరిగిన వరి పంట. నిన్నటి రాత్రి 12 గంటల తరువాత వీచిన ఈదురు గాలులకు వరి పంట మొత్తం నెలకొరిగిందని రైతులు వాపోతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడం రైతుకి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని బాధితులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం వరి దాన్యాన్ని కొంటుందో లేదో అన్న అనుమానంతో కొంత మెరకే వరి పంటను పండించిగా నిన్నటి రాత్రి వీచిన గాలులకు రైతుకి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని బాధితులు పేర్కొన్నారు.