Telugu News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య

** ఆసుపత్రిలో చికిత్స.. ఆరా తీసిన నామా

0

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య

 

** ఆసుపత్రిలో చికిత్స.. ఆరా తీసిన నామా

 

** మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఎంపీ నామ సూచన.

(ఖమ్మం-విజయం న్యూస్);-

ఖమ్మం రూరల్ మండలం, పల్లెగూడెం వద్ద బుదవారం ఉదయం మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మోటర్ సైకిల్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతోఈ ప్రమాదంలో పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి 108 వాహనం ద్వారా తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

also read;-వైభవంగా నరసింహస్వామి కళ్యాణం.

** ఆరా తీసిన నామా

విషయం తెలుసుకున్న టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి రామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రామయ్యకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరం అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని ఎంపీ నామ వైద్యులకు సూచించారు.