ప్రజాదర్బార్ విలేకరిపై సర్పంచ్ భర్త దాడి
===మా పై వార్తలు రాస్తావా ?నిన్ను చంపేస్తా
(కారేపల్లి/ కామేపల్లి – విజయం న్యూస్);-
కందుల ప్రసాద్ పై సింగరేణి సర్పంచ్ భర్త ఆదెర్ల ఉపేందర్ గురువారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామ హోటల్ వద్ద దాడి చేశారు .సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .సింగరేణి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం విషయంపై సింగరేణి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కొందరు మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు.
also read :-అవి బంతులా.. బుల్లెట్లా?
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ నిధుల విషయమై విలేకరులకు అనేక విషయాలు వివరించారు .ఈ విషయాలను పత్రికల్లో రాసినందుకు, మా పై వార్తలు రాస్తావా ?నిన్ను చంపేస్తా అంటూ సర్పంచ్ భర్త ఉపేందర్ గురువారం కర్ర చేత పట్టుకొని వీరంగం చేస్తూ కందుల ప్రసాద్ పై దాడికి పాల్పడ్డాడు .సర్పంచ్ స్రవంతి ఈ వార్త వాళ్ల నా పరువు పోయింది అంటూ హోటల్ గేట్ వద్ద బైఠాయించింది.
సర్పంచ్ భర్త ను ఆపడానికి ప్రయత్నించిన కొందరిని కూడా నానా దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించాడు .సాటి విలేకరుల ముందు తనను అవమానించి ,భౌతిక దాడికి పాల్పడి,తన ప్రతిష్టకు భంగం కలిగించిన సర్పంచ్ స్రవంతి ,ఆమె భర్త ఉపేందర్ ,టిఆర్ఎస్ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడు ప్రసాద్ కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.