Telugu News

ఖమ్మంలో రూ.75 లక్షల విలువైన గంజాయి పట్టివేత

(ఖమ్మం -విజయంన్యూస్)

0

ఖమ్మంలో రూ.75 లక్షల విలువైన గంజాయి పట్టివేత

(ఖమ్మం -విజయంన్యూస్);-

ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశాలోని బుర్హన్‌పుర్‌ నుంచి లారీలో ఖమ్మం మీదుగా రాజస్థాన్‌ తరలిస్తున్న 75 లక్షల విలువైన 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్. వారియర్‌ తెలిపారు. గంజాయిని పరిశీలించిన సీపీ వాటిని పట్టుకున్న పోలీసులను అభినంధించారు. అక్రమ రవాణాను కచ్చితంగా అడ్డుకుని తీరతామని, ఎవర్ని వదలబోమని హెచ్చరించారు.