Telugu News

ఏప్రిల్ 4 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిళ పాదయాత్ర

విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలన్న లక్కినేని

0

ఏప్రిల్ 4 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిళ పాదయాత్ర

== విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలన్న లక్కినేని

(ఖమ్మం –విజయంన్యూస్);-

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి తలపెట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఏప్రిల్ 4న జిల్లాలో ప్రారంభం కానుందని, ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని నగరంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ బాబు తెలిపారు.

also read;-యాదాద్రి దివ్య‌క్షేత్రం సాక్షాత్కారంతో నెర‌వేరిన సీఎం కేసీఆర్‌ సంక‌ల్పం

సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో వైఎస్ షర్మిలరెడ్డిని మనం ముఖ్యమంత్రిగా చూడాలని, అందుకు అందరూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం కాకరావాయి గ్రామం నుంచి ఖమ్మం జిల్లాకు షర్మిళ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.

also read;-మాటిచ్చిన.. నీళ్లు పారించిన..”

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కో – ఆర్డినేటర్ గడిపల్లి కవిత , మధిర నియోజవర్గ కో – ఆర్డినేటర్ దొంతమల కిషోర్ కుమార్ , వైరా నియోజకవర్గం కో – ఆర్డినేటర్ ఇస్లావత్ రాంబాబు నాయక్ , రాము నాయక్ , జిల్లా నాయకులు మద్దెల ప్రసాదరావు , ఖమ్మం టౌన్ నాయకులు ఆలస్యం రవి , నియోజకవర్గల మండల అధ్యక్షులు వాలూరి సత్యనారాయణ , సామినేని రవి , వాకా వీరారెడ్డి , షేక్ మౌలానా , ఉమామహేశ్వరరావు , మస్తాన్ పాషా , పి రాఘవ , గోరంట్ల రమేష్ బాబు , ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు .