గ్రామీణ విద్యను ప్రోత్సహించడమే జేవీఆర్ లక్ష్యం
** లోకల్ కళాశాల అయిన ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు
** పేదలకు ఉచిత విద్య అoధిస్తా
** వీడ్కోలు కార్యక్రమంలో జే వి ఆర్ కళాశాల అధ్యక్షులు రమేష్
(పెండ్ర అంజయ్య, కూసుమంచి-విజయం న్యూస్);-
విద్యను వ్యాపారంగా మార్చి లాభాపేక్ష దుష్టితో కాకుండా విద్యాదానం లక్ష్యంతో జేవీఆర్ కాలేజీని స్థాపించటం జరిగిందని,త్వరలోనే సొసైటీగా( ట్రస్ట్) చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యానందిస్తానని జేవీఆర్ కళాశాల డైరెక్టర్ రమేష్ తెలిపారు.శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలో జేవీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెర్వెల్ డే ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాడు విద్యా,వైద్యం వ్యాపార వస్తువుగా మారిందని ఆవేదన చెందారు.కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో జీతం కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్ ను దుష్టిలో పెట్టుకొని అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
also read :-ప్రజాదర్బార్ విలేకరిపై సర్పంచ్ భర్త దాడి
ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి,విద్యా సముపార్జనే లక్ష్యంగా చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాక్షించారు. జె.వి.ఆర్ ప్రగతి డిగ్రీ కాలేజీ కాలేజీ ప్రిన్సిపాల్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె గ్రామంలో కాలేజీని స్థాపించి నగరాల,పట్టణాల కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా జాతీయ,రాష్దీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్న సంస్థ ఒక్క జేీవీఆర్ కాలేజీ మాత్రమేనని పేరొన్నారు.విద్య ఖరీదైన ఈ కాలంలో పేదప్రజల,పల్లె గ్రామాల ప్రజలు తమ పిల్లలను పట్టణాలకు పంపి లక్షల్లో ఖర్చుపెట్టి చదువును కొనలేని వారికి ఆశాజ్యోతిగా జేవీఆర్ కాలేజీ ఉండాలని బావించి రంగారావు 30 సంవత్సరాల క్రితం (1992) స్థాపించిన కాలేజీ దిన దిన వర్ధమాన చంద్రునిగా అభివృద్ధి చేసి డిగ్రీ కాలేజీ వరకు దిగ్విజయంగా నడుస్తున్నదని చెప్పారు.విద్యార్థులకు క్రమశిక్షణ,నైతిక విలువలతో పాటుగా విద్యానుకూడా అందజేస్తున్నామని,ఇక్కడ విద్యను కొనరని,విద్యానభ్యసిస్తారని ప్రశంశించారు.ఈ 30 సంవత్సరాల కాలంలో ఈ కాలేజీ నుండి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో జీవించే విదంగా తయారు చేసిందని,అంకితభావంతో పని చేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు చెప్పారు.
also read :-పాఠశాల లో మద్యం సేవించిన ప్రదనో పాధ్యాయు లు, సర్పంచ్ భర్త.
కె వి ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్వాతి శ్రీవల్లిని మాట్లాడుతూ విద్యార్థులంతా తమ తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా విద్యలో రాణించాలని,అదే విదంగా నైతిక ప్రవర్తన,విలువలతో జీవించాలని కోరారు.అధ్యాపకులు వీరబాబు మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకొని మ్యాచ్ లెక్చరర్గా విద్యార్థులకు చదువు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పాపారావు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో విద్యార్థులు లక్షల్లో ఖర్చుపెట్టి చదువుతూ ఉంటే ఇక్కడా విద్యతో పాటు విద్య పూర్తి అయి కాలేజీ నుండి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత పారితోషికం అందిస్తున్న ఏకైక సంస్థ జేవీఆర్ కాలేజీ యాజమాన్యమని చెప్పారు .ఈ సందర్భంలో అనేక మంది విద్యార్థులు ఆటా పాటలతో కనువిందు చేస్తూ సందడి సందడిగా గడిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తల్లిదండ్రులు పాల్గొని అందరినీ అభినందించారు.