Telugu News

బాల రత్న” జాతీయ పురస్కారం 2022కు ఎంపికైన తనిష్క

ఖమ్మం-విజయంన్యూస్

0

బాల రత్న” జాతీయ పురస్కారం 2022కు ఎంపికైన తనిష్క
(ఖమ్మం-విజయంన్యూస్)
ఖమ్మం రూరల్ మండలంలోని జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన పదవ తరగతి విద్యార్థి ని కొనకండ్ల తనిష్క “బాల రత్న” జాతీయ పురస్కారం 2022కు ఎంపికైన ట్లు పుడమి సాహిత్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్. చిలుముల బాల్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.

also read :-రొంపిమళ్లలో కలెక్టర్ ఇంటింట సర్వే

తనిష్క పలు రంగాల్లో చేస్తున్న విశేష కృషి ని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పురస్కారాన్ని పుడమి సాహిత్య వేదిక మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 27 వతేదీ ఆదివారంనాడు నల్గొండ లో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా బాల రత్న పురస్కారాన్ని అందజేయనున్నారు.