Telugu News

***నేనున్నానని మీకేంకాదని : మాజీ ఎంపీ పొంగులేటి

***బాధిత కుటుంబాలను ఓదారుస్తూ... ఆర్ధిక సాయం చేస్తూ...

0

***నేనున్నానని మీకేంకాదని : మాజీ ఎంపీ పొంగులేటి
***బాధిత కుటుంబాలను ఓదారుస్తూ… ఆర్ధిక సాయం చేస్తూ…
***జిల్లాలో కొనసాగిన పొంగులేటి పర్యటన
***(ఖమ్మం-విజయంన్యూస్):-

ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటంబాలను ఓదారుస్తూ… భర్తను కోల్పోయిన భార్యకు ఆర్ధిక సాయం చేస్తూ ఏ కష్టం వచ్చినా అండగా నేనుంటాననే భరోసానిస్తూ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన శనివారం కొనసాగింది. జిల్లాలో మూడవ రోజు పర్యటనలో భాగంగా ఖమ్మం, తల్లాడ, కల్లూరు మండలాల్లో పర్యటించారు.

కల్లూరు : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానందు శనివారం కల్లూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు యాసా శ్రీకాంత్ నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ గార్డెన్ రెస్టారెంట్ పొంగులేటి ప్రారంభించారు.

తన వ్యాపారం బాగా అభివృద్ధి మరింత వృద్ధిలోకి రావాలని అకాంక్షించారు. టీఆర్ఎస్ నాయకులు కాటేపల్లి కిరణ్ పెళ్లి రోజు సందర్భంగా వారి ఇంటి వద్ద తేనీటి విందులో పాల్గొని దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం మండలంలోని లింగాల, చెన్నూరు, పెద్దకోరుకొండ, తాళ్లూరు వెంకటాపురం, మర్లపాడు, యజ్ఞనారాయణపురం, విశ్వనాధపురం, హనుమాన్ తండా, పుల్లయ్యబంజర్, తూర్పు లోకవరం, పడమటి లోకవరం గ్రామాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నూతనంగా వివాహం చేస్తున్న పెళ్లి జంటలను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న, కుటంబ సభ్యులను కోల్పోయిన పలు కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయంను అందజేశారు.

also read :-హిజాబ్ అనే వస్త్రధారణ ముస్లిం మహిళల సంప్రదాయం

పొంగులేటి వెంట మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారయణరెడ్డి, మండల నాయకులు యాసా వెంకటేశ్వరరావు, కాటేపల్లి కిరణ్, కీసర శ్రీనివాసరెడ్డి, మాటూరి జనార్థన్, ఏసురెడ్డి, ఏనుగు సత్యంబాబు, కర్నాటి రామకృష్ణ రెడ్డి, ఎస్.కె. ఉస్మాన్, బత్తుల రాము, చారుగండ్ల అచ్యుతరావు, దోసపాటి కృష్ణార్జునావు,
దోసపాటి భాస్కరరావు, నాగుబండి శ్రీనివాసరావు, మోటమర్రి ప్రభాకర్, నోటి కృష్ణారెడ్డి, మోటమర్రి శ్రీను, రాజేష్, ప్రసాద్, అవినాష్, నరేంద్ర, దామళ్ల సురేష్, ఆళ్లకుంట నర్సింహారావు, మైబు, నరేంద్ర తదితరులు ఉన్నారు.

పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం నగరం : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం ఖమ్మం పట్టణంలో పర్యటించారు. గాంధీనగర్ చింతకానికి చెందిన పాపబత్తిని సుజాత పొంగులేటిని వారి క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆమె ఆర్ధిక ఇబ్బందులను తెలుపుగా ఆమెకు ఆర్ధిక సహయంను అందజేశారు.

మేకల తండాకు చెందిన యూత్ క్యాంప్ కార్యాలయంలో వారు నిర్వహిస్తున్న క్రికెట్ టెర్నమెంట్ వివరాలు తెలుపగా వారికి రూ.15వేలు అందజేశారు. శ్రీనగర్ కాలనీ బద్దం కోటిరెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా వారి ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసనగర్ లో దేవకీరాణి, సోమేశ్వరిల కుమార్తె బారసాల వేడుకలో పాల్గొని చిన్నారిని దీవించారు.

also read :-రైతుబంధు సమితి క్యాలెండర్ ను అవిష్కరించిన ఎంపీపీ

సర్వేయర్ పుల్లారావు నూతన గృహప్రవేశం సందర్భంగా వారి ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. చైతన్య నగర్ లో మోరంపుడి ప్రసాద్ రావు కుమార్తె స్వేత ఇటీవల చనిపోయినందున కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పోరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, నగర నాయకులు షేక్ హిమామ్, దుంపల రవికుమార్, తోట ప్రసాద్, కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, సొసైటీ చైర్మన్ చెరుకుమల్ల రవి, పొట్లపల్లి శేషగిరిరావు, వట్టికూటి సైదులు గౌడ్, కొమ్ము మల్లయ్య, సంతోష్ ముక్కెర, నాగార్జున్, షేక్ షఫీ, సామల సాయి, బత్తుల శ్రీను, గిరిజ, రాజ్యలక్ష్మీ, బెజ్జం వెంకన్న, దొడ్డా నాగరాజు, గుండు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

తల్లాడలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి
తల్లాడ : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం తల్లాడ మండలంలో పర్యటించారు. తల్లాడ అంబేద్కర్ నగర్ కు చెందిన మర్పకట్ల బాబురావు కుమారుని వివాహం సందర్భంగా దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. శీలం రామిరెడ్డి కుమారుడు రామకోటారెడ్డి పెద్దకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.

also read :-మోదుగు ఆశీర్వాదంకి వైరా మార్కెట్ చైర్మన్ పదవిని కేటాయించాలి .

యరమల రుక్మిణి ఇటీవల చనిపోయినందున ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తల్లాడ పట్టణంకు చెందిన బొడ్డు కృష్ణ పెద్దకర్మ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. దారా విష్ణు మోహన్ తల్లి చనిపోయినందున కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నారుగూడెం తంబుళ్ల సిల్వరాజ్ కుమార్తె ట్రిపుల్ ఐటీలో సీలు సాధించినందుకు విద్యార్థినిని అభినందించి రూ. ఐదు వేలు బహుమతిగా అందజేశారు. అంజనాపురం మాజీ సర్పంచ్ గురజాల రామారావు తల్లి చనిపోయినందున ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళు లు అర్పించారు. దారా సుబ్బమ్మ ఇటీవల చనిపోయినందున ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పర్యటనలో భాగంగా పలు కుటుంబాలకు ఆర్ధిక సహాయంను అందజేశారు. పొంగులేటి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, జక్కంపుడి కృష్ణమూర్తి, దుండేటి వీరారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, దిరిశాల నర్సింహారావు, తూము వెంకట నారాయణ, ఎర్రి నర్సింహారావు, గణేషుల రవి, పైడిపల్లి రవి, తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, జట్ పీటీసీ ముకర ప్రసాద్, బస్వాపురం మాజీ సర్పంచ్ వెంకట మైబు, ఎడ్రీ కృష్ణారెడ్డి, పొట్టేటి బ్రహ్మారెడ్డి, పొట్టేటి జనార్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అయిలూరి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.