ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ
-ప్రయాణికులకు గాయాలు
-తప్పిన ప్రాణాపాయం
(పెండ్ర అంజయ్య- ఖమ్మం-విజయంన్యూస్);-
పొద్దుపొద్దుగళ్ళా టక్కర్ ప్రమాదం జరిగింది.. ఆర్టీసీ బస్సుని, లారీ ఢీకొట్టింది.. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు.. ఖమ్మం ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ లోని కి వెళ్తున్న బస్సును లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కొందరు దిగి పరిగెత్తారు.
also read :-ఖమ్మం..అనుమానం తో భార్యపై కత్తితో దాడి..
గాయపడినవారిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను లారీలు ఢీకొంటున్న ప్రమాద సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజలు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బైపాస్ రోడ్డు వెంబడి ఆర్టీసీ కొత్త బస్టాండ్ వుండడం, వేగ నియంత్రణ కోసం ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రధాన రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్ లోని కి , బయటికి వస్తున్న బస్సులను లారీలు తరచూ డీ కొంటున్నాయి. బస్టాండ్ సెంటర్లో సెక్యూరిటీ సిబ్బందిని కానీ ట్రాఫిక్ పోలీసులను కానీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.