Telugu News

ఆలయ మేనేజర్ పైన వచ్చిన   ఆరోపణలపై విచారణ.

ఏన్కూరు విజయo న్యూస్:

0

ఆలయ మేనేజర్ పైన వచ్చిన   ఆరోపణలపై విచారణ.

(ఏన్కూరు విజయo న్యూస్):-

మండల పరిధిలోని నాచారం వెంకటేశ్వర స్వామి దేవాలయం లో పనిచేస్తున్న అర్చకులు ఆలయ మేనేజర్ పైన వచ్చిన ఆరోపణలపై బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విచారణ చేశారు. గత కొన్ని రోజుల క్రితం నాచారం గ్రామస్తులు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

also read;-నక్సల్స్ కుట్ర భగ్నం చేసిన భద్రతా బలగాలు

ఈ ఫిర్యాదు మేరకు సంబంధిత శాఖ అధికారులు నాచారం దేవాలయానికి వచ్చి విచారణ చేశారు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత, సీనియర్ అసిస్టెంట్ ఆనంద్, ఎంపీపీ వరలక్ష్మి, సర్పంచ్ రాంబాబు, ప్రవీణ్, వినోద్, సుధీర్, నవీన్,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.