Telugu News

అమెరికా సదస్సులో కూసుమంచి మండల యువకుడి అద్భుత స్పీచ్

(కూసుమంచి-విజయంన్యూస్

0

అమెరికా సదస్సులో కూసుమంచి మండల యువకుడి అద్భుత స్పీచ్

(కూసుమంచి-విజయంన్యూస్)

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన వెబనార్, ఆ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ (న్యూటీపుడ్-2022) సదస్సులో హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటి లో పరిశోధన చేస్తున్న కూసుమంచి మండలం కోక్యతండాకు చెందిన విద్యార్థి హలావత్ రమేష్ అద్భుతమైన స్పీచ్ నిచ్చి అమెరికన్ వాసులను అకట్టుకున్నారు. తాను చేసిన పరిశోధన వ్యాసము బెంజోయేట్స్ క్లాస్ ఆప్ పుడ్ ప్రిజర్సేటీవ్స్, కాన్ వాట్స్, నెటివ్ ప్రోటిన్స్ టూ అదుర్పస్స్ అగ్రిగెట్ ఫలితాలను ప్రజెంటేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సీనియర్ ఆచార్యులు అంబానికె బూయన్ ఆధ్వర్యంలో రసాయన శాస్త్త్రంలో విభాగంలో పిహెచ్ డి చేస్తున్నాడు

also read;-మంత్రి పువ్వాడ క్షేమం..

ఆహరం జీవం ఉన్న ప్రతి జీవికి ఎంతో ముఖ్యమైనది. సాదారణంగా అహారపదార్థాలను ఎక్కవు కాలం నిలువ చేయడానికి ,బ్యాక్టీరియాల నుంచి కాపాడటానికి బెంజోయేట్స్ క్లాస్ రసాయనాలను ఎఫ్ఏవో-డబ్య్లూహెటీవో సంస్థ అనుమతించిన మోతాదులో వాడుచున్నారు. కనీసం ప్రయోగ ఫలితాల ద్వరా ఎఫ్ఏవో-డబ్ల్యూహెచ్వో అనుమతించిన పరిధి బెంజోమెట్స్ క్లాస్ ప్రిజర్నింటివ్స్ ఆహార పదార్థలకు కలిపిన గంటలు, రోజులలో మానవ శరీరంలోని ప్రోటిన్స్ నిర్మాణాలు ఆకారహితంగా మరి, పార్కెన్స్ న్ని వంటి అనేక వ్యాధులు సక్రమిస్తాయని ప్రజంటేషన్ చేశాడు.

also read;-కేవిఆర్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

రసాయనాలతో కూడిన కలుషిత ఆహారం భవిష్యత్ మానవళి మనుగడకు ఒక డేంజర్ బెల్ గా మారబోతుందని అతను చెబుతున్నాడు. ముఖ్యంగా పిల్లలను జంక్ పుడ్ నుంచి దూరంగా ఉంచడం చాలా మంచిందని తెలిపారు. జంక్ పుడ్ తినడం వల్ల భవిష్యత్ లో వచ్చే అనారోగ్య పరిస్థితి పై ఆయన వివరించారు. ఎంత మోతాదులో ప్రజలు రసాయనిక ఆహారం తీసుకోవాలో, తద్వారా మానవాళికి తగ్గే ప్రమాద ఘటికలను కూడా ఆయన వివరించారు.

also read;-యాదాద్రి మీద ఉన్న శ్రద్ధ రామయ్య మీద లేదా….

దీంతో రమేష్ వివరించిన ప్రజంటేషన్ జాతీయ, అంతర్జాతీయ మీడియా, పుస్తకాలలో ప్రచురితమైయ్యాయి. అయితే అలాంటి ప్రజేంటేషన్ చేస్తుండటంతో అమెరికలోని ప్రజాప్రతినిధులు, అధికారలు రమేష్ ను అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న విజయం ప్రతినిధి రమేష్ తో పోన్ లో మాట్లాడగా వివరాలను తెలియజేశారు. ఇంతలా నన్ను ప్రోత్సహించిన నన్ను కన్నతల్లిదండ్రులకు, నా స్వగ్రామం కోక్యతండా ప్రజలకు, కూసుమంచి మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నాకు విద్యనేర్పిన గురువులను మర్చిపోలేనని ఆయన చెప్పారు. రమేష్ కు విజయం పత్రిక తరుపున కూడా అభినందనలు చెబుతుంతోంది.. మరింతగా ఎదగాలని అకాంక్షిస్తున్నాం.