Telugu News

బుగ్గవాగు వద్ద పులి సంచారం

కామేపల్లి- విజయం న్యూస్

0

బుగ్గవాగు వద్ద పులి సంచారం

(కామేపల్లి- విజయం న్యూస్)

కామేపల్లి మండలం పొన్నెకల్లు బుగ్గవాగు సమీపంలో గురువారం రాత్రి
పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు రైతులు గుర్తించారు. ఆంజనేయులు అనే రైతు తన శెనగ తోటకు రాత్రి నీళ్ళు పెట్టి వెళ్ళాడు.
శుక్రవారం ఉదయం చేను వద్ద పరిసరాలు చూడగా పెద్దపులి పాదముద్రలు
కనిపించాయి.

also read  :-ఖమ్మం నగరంలో ఎంపీ నామ సుడిగాలి పర్యటన

దీంతో సింగరేణి టవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.
సంబంధిత అధికారి సింగరేణి ఫారెస్ట్ రేంజర్ సిద్ధార్థ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి పులి పాదముద్రలుగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ లక్ష్మీ భార్గవి సూచించారు.