Telugu News

గార్లఒడ్డు లో వైభవంగా తిరువీధి ఊరేగింపు ఉత్సవం

0

గార్లఒడ్డు లో వైభవంగా తిరువీధి ఊరేగింపు ఉత్సవం

ఏన్కూరు మే 24:

(రిపోర్టర్ -చారి)
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరువీధి ( ఊరేగింపు) ఉత్సవ కార్యక్రమంఅత్యంత వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాత కార్యక్రమం తో మొదలై, నిత్య ఆరాధన, సేవా కాలం,బాల భోగం, తీర్థ ప్రసాద గోష్టి, యాగశాల ఆరాధనలు, నిత్య హోమము, పూర్ణవతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.. .ఈ కార్యక్రమాలు దాత జాలాది దొరబాబు ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమంలో ,,ఆలయ మేనేజర్ శేషయ్య,ప్రధాన అర్చకులు బీటుకూరి వేణుగోపాలచార్యులు, నాగరాజా చార్యులు,కిరణ్ కుమార్ చార్యులు,భక్తులు పాల్గొన్నారు..

ఇది కూడా చదవండి:- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం: పొంగులేటి