కబ్జాకు గురైన నా భూమిని నాకు ఇప్పిస్తారా ? లేదా ఆత్మహత్య చేసుకుంనేందుకు పర్మిషన్ ఇస్తారా ?
జెడ్పీ సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓ వృద్ధుడు నిరాహార దీక్ష.
కబ్జాకు గురైన నా భూమిని నాకు ఇప్పిస్తారా ? లేదా ఆత్మహత్య చేసుకుంనేందుకు పర్మిషన్ ఇస్తారా ?
జెడ్పీ సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓ వృద్ధుడు నిరాహార దీక్ష.
తదనంతరం గ్రీవెన్స్లో కలెక్టర్ కు వినతిపత్రం
(ఖమ్మం విజయం న్యూస్):-
ఖమ్మం జిల్లా కలెక్టర్ కు , పోలీస్ కమిషనర్ కు అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటారా ? లేక నాకు ఆత్మహత్య చేసుకుంనేందుకు పర్మిషన్ ఇస్తారా ? అని ఫ్లెక్సీ తో జెడ్పీ సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓ వృద్ధుడు నిరాహార దీక్షకు పూనుకున్నాడు . ఖమ్మం పట్టణం మోతీ నగర్లో సర్వే నెంబర్ 102 లో తనకు సంబంధించిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముక్క వీరయ్యచౌదరి , పెద్ద కేశవరావు లు సహకారంతో ఆక్రమించుకొని తనన్ను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు . తదనంతరం అట్టి విషయం పై గ్రీవెన్స్లో కలెక్టర్ పీవీ గౌతమికి వినతిపత్రాన్ని అందజేశారు . సర్వే నెంబర్ 102 నందు గల వారి తూర్పు , దక్షిణం వారి హద్దులు వదలి , పడమరలో తనకు ఉన్న భూమిని ఆక్రమించి , తనన్ను చంపుతా అన్ని బెదిరించడం జరిగిందని , దీనిపై సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారు తనకు సహకరించడం లేదని , తనాకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు .
also read;-వరి ధాన్యం కొనుగోళ్ళ పై కేంద్రం మీద పోరుకు
వృద్ధ బాధితుడు గోపు వెంకటరామయ్య {(S /O) సోమయ్య } మాట్లాడుతూ తను డాబాల బజార్ లో నివాసం ఉంటున్నాడని 1980వ సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 1626/1980 ద్వారా ఎకరం భూమిని మోతీ నగర్ నందు కొన్నాడని , అందులో 4 ప్లాట్లు ను నా వృద్ధాప్యం అవసరముల కొరకు ఉంచుకున్నానని తెలిపారు . తను భూమిని కొన్న అదే రోజు రావూరి మహేశ్వరి అనే వ్యక్తి డాక్యుమెంటు నెంబర్ 1624/1980 ద్వారా తను కూడా పక్కనే ఉన్న భూమి కొన్నాడని తెలిపారు .
also read;-లింగరంతండా దేవాలయ నిర్మాణానికి కందాళ చేయూత
అయితే వారి భూమికి తూర్పున సర్వే నెంబర్ 100 , వాసికర్ల అనంత రాములు భూమి సర్వే నెంబర్ 99 , శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము మాన్యం భూమి దక్షిణమున సర్వే నెంబర్ 99 , శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము మాన్యం భూమి సర్వే నెంబర్ 103 , వాకిళ్ళ సుబ్రహ్మణ్యం భూమి హద్దులు గలవు అన్ని పేర్కొన్నారు . దక్షిణ సరిహద్దు మీద సర్వే నెంబర్ 103 , డాక్యుమెంట్తో సర్వే నెంబర్ 102 భూమినీ అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని , తూర్పు హద్దు మీద కొంత భూమి అక్రమంగా అమ్మినారు అని ఆరోపించారు . వారు రోడ్డు కొలతలు తీసుకొని రాలేదు . పైన సూచించిన మూడు అక్రమ విధానముల వలన సుమారు 1500 చ॥గ॥ తగ్గిందని కావున సంబంధించిన అధికారులను పంపించి పూర్తిస్థాయిలో సర్వే చేయించి నా భూమిని నకు ఇప్పించమని వేడుకున్నారు .