Telugu News

పుస్తకాలతో కుస్తీ

రెండేళ్ల తరవాత మళ్లీ పబ్లిక్‌ పరీక్షలు

0

పుస్తకాలతో కుస్తీ

== రెండేళ్ల తరవాత మళ్లీ పబ్లిక్‌ పరీక్షలు

== సన్నిద్దమవుతున్న విద్యార్థులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-

పరీక్షల కాలం వచ్చేస్తోంది.. కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల పాటు దూరమైన పబ్లిక్ పరీక్షలు మళ్లీ షూరు కానున్నాయి.. రెండేళ్ల పాటు పరీక్షలు రాయకపోయిన విద్యార్థులను పాస్ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. ఇప్పటికే పబ్లిక్ పరీక్షలకు షెడ్యూల్ ను విడుదల చేసిన విద్యాశాఖ అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. పరీక్షపేపర్ తయారు చేయడం, విద్యార్థులను సన్నిద్దం చేయడం, అందుకు సంబంధించిన కసరత్తు చేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది.. కాగా విద్యార్థులు కూడా అందుకు సర్వం సిద్దమవుతున్నారు. పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తిపడుతున్నారు..

also read :-నేడు జిల్లాలో పొంగులేటి పర్యటన

మంచి మార్కులతో పాస్ కావాలని నిరంతరం చదువుపై ద్రుష్టిపెడుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థలు పరీక్షల కోసం విద్యార్థులు సిద్దం చేస్తున్నారు. మంచి ఫలితాలను రాబట్టేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అవసరమైన చోట నైట్ క్లాస్ లు, ఉచితంగా హాస్టల్ వసతి కల్పిస్తూ విద్యార్థులు గురువుల పరిధిలోనే ఉంచుకుని చదువులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. రెండేళ్ల పాటు ఎగ్జామ్స్‌ లేకుండా పాసైన విద్యార్థులు ఈ ఏడాది మంచి గ్రేడ్‌ సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈసారి అసలైన పరీక్ష ఎదురుకానున్నది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే అందరూ పాసైపోయారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. కరోనా తగ్గడంతో పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇంటర్‌ పరీక్షలను ఈనెల 22 నుంచి నిర్వహించాలని అనుకున్నా జేఈఈ మెయిన్స్‌ పరీక్ష తేదీలను మార్చడంతో మరోమారు ఇంటర్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ను మార్చారు. మే 6 నుంచి 24 వరకు పరీక్ష తేదీలను ఖరారు చేశారు. మే 23 నుంచి జూన్‌ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు సన్నద్ధమవుతున్నది. వెనుకబడిన వారిపై నజర్‌ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చదువులో వెనుకబడిన వారిని ఉపాధ్యాయులు గుర్తిస్తున్నారు.

also read :-త్వరలో ఓటిటిలోకి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ

వారిపై ప్రత్యేక దృష్టి సారించి 3 గంటల పాటు ప్రత్యేక బోధన చేస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు ప్రత్యేకంగా విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తున్నారు.
ఇంటర్‌ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించారు. మే 6 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పదోతరగతి పరీక్షలు రెండేళ్లుగా పరీక్షల ఫలితాలను చూడని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సారి తమతమ పాఠశాలల ప్రాధ్యానతను నిలుపుకునేందుకు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మే 23 నుంచి జూన్‌ 1వరకు పరీక్షలు జరుగునున్నాయి.