Telugu News

యాసంగి ధాన్యం కేంద్ర సర్కార్ కొనాల్సిందే

-ఖమ్మం మార్కెట్ చైర్ పర్సన్ డౌలే లక్ష్మి ప్రసన్న

0

యాసంగి ధాన్యం కేంద్ర సర్కార్ కొనాల్సిందే

-ఖమ్మం మార్కెట్ చైర్ పర్సన్ డౌలే లక్ష్మి ప్రసన్న

-పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

(ఖమ్మం-విజయం న్యూస్)

జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం యాసంగి సీజన్‌లో సాగు జరిగిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న సాయి కిరణ్ డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

also read;-కన్నీరు పెట్టించిన “జరుగుతున్న కథ”నాటిక

ఈ సమావేశం లో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి. పీఎం నరేంద్రమోడి, సీఎం కేసీఆర్ కు తీర్మానం ప్రతులను పంపించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ కే.వెంకటేశ్వర్లు, పాలకవర్గం సభ్యులు, గ్రేడ్. టూ సెక్రటరీ బి. బజార్, అసిస్టెంటు సెక్రటరీ లు డీ.నిర్మల, రాజేంద్రప్రసాద్, సూఫర్ వైజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెంటనే రిజిస్టర్ పోస్టులో ఢిల్లీ, హైదరాబాదు లకు తీర్మానాలు పంపించారు.