Telugu News

ఖమ్మంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు.*

ఖమ్మం-విజయం న్యూస్

0

ఖమ్మంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు.*
(ఖమ్మం-విజయం న్యూస్)
“జాతీయ యువజన దినోత్సవం” పురస్కరించుకొని స్వామి వివేకానంద 159 వ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

స్థానిక ఇల్లందు క్రాస్ రోడ్ లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి యువజన విభాగం నేతలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ..
యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి,
స్వామి వివేకానంద 159 వ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగిందని, ఉక్కు కండరాలు కలిగిన యువతను నాకు అందిస్తే దేశ భవిష్యత్తును మార్చే వేస్తానని, స్వామి వివేకానంద చైతన్యవంతమైన మాటలతో యువతకు స్ఫూర్తి ప్రదాతగా మిగిలిపోయారని, యువత సాధించాల్సిన లక్ష్యాలు, నిరంతరం యువతలో చైతన్యం రగిలించే సూక్తులతో యువత కోసం అహర్నిశలు కృషి చేశారని,

యువత పట్టుదలతో ముందుకు రాణిoచాల్సిన అవసరం ఉందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo,ముఖ్యమంత్రి కేసీఆర్ ,యువ నాయకుడు కేటీఆర్ ఆధ్వర్యంలో మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పది లక్షల పైచిలుకు ఉద్యోగాలు సాధించగలిగారు అని, ప్రపంచంలోనే నెంబర్వన్ ఐటి హబ్ సెంటర్ హైదరాబాద్ ఏర్పడిందని, కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన ఐటి సేవలు మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా అందజేసిన ఘనత కేటీఆర్ ది అని, దీనిలో భాగంగానే ఖమ్మం నగర నడిబొడ్డున కోట్లాది రూపాయలతో ఐటి హబ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయని, అన్నారు.
స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు నడవాల్సిన అవసరం ఉందని అనుకున్న లక్ష్యాలు సాధించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం పట్టణ ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్,ఉపాధ్యక్షులు మొహమ్మద్ తౌసిఫ్ బాబి, సరిపుడి గోపి సందేశ్, బలుసు మురళీకృష్ణ, యువజన విభాగం నేతలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.