Telugu News

ఖమ్మంలో తెరాస లీగల్ సెల్ లోకి భారీగా చేరికలు..

మంత్రి పువ్వాడ సమక్షంలో చేరిన యువ న్యాయవాదులు.

0

ఖమ్మంలో తెరాస లీగల్ సెల్ లోకి భారీగా చేరికలు..

◆ మంత్రి పువ్వాడ సమక్షంలో చేరిన యువ న్యాయవాదులు.

(ఖమ్మం  విజయం న్యూస్):-

ఖమ్మం జిల్లా కోర్టు పరిధిలో గల పలువురు న్యాయవాదులు పెద్ద ఎత్తున టీ ఆర్ ఎస్ లీగల్ సెల్ లో చేరారు…

ఆదివారం సిక్వెల్ రిసార్ట్స్ లో జరిగిన టీఆరెస్ లీగల్ సెల్ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హాజరయ్యారు…బిచ్చాల తిరుమలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు యువ న్యాయవాదులు పెద్ద ఎత్తున టీఆరెస్ లీగల్ సెల్ లో కొత్తగా చేరారు.

ALSO READ :-కవచ్ రైల్వే రక్షణ వ్యవస్థ ప్రయోగం విజయవంతం

పార్టీలో చేరిన వారిలో కొనా చంద్ర శేఖర్ గుప్తా, వేల్పుల సురేష్, చంద్రావతి, సుధాకర్, ఐతగాని జనార్ధన్, లావుడియ రాజశేఖర్, శివ సంతోష్, టి రమేశ్, ముచ్చర్ల నర్సింహ రావు, కే ప్రసాద్, త్రివేణీ, సింగం జనార్ధన్, దేవరకొండ కల్యాణి, ఎస్ లోకేష్, సాయి భావనా, పాషా, కే జయరాజు తదితరులు ఉన్నారు. వీరందరికి మంత్రి పువ్వాడ తెరాస పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు..

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నాయకత్వములో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడిందని, ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని, స్పష్టం చేశారు.

తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు… విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామని తెలిపారు. మౌళికసదుపాయాల కల్పనలో టీఆరెస్ ప్రభుత్వం ముందు ఉందన్నారు.

నిరంతర విద్యుత్ సరఫరాలో, తాగు, సాగు నీటి పంపిణీలో దేశంలోనే అగ్రగామిగా నిలబడి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడిందన్నారు..

also read :-తెలంగాణ ప్రజల ఆత్మబంధువు కేసిఆర్ : మంత్రి అజయ్ కుమార్

అదే క్రమంలో ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఇరుకు రోడ్లు.. నేడు విశాల రహదారులయ్యాయని, కూడళ్లు సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. లక్షలాది మంది ఆడపిల్లలకు షాది ముబారక్, కళ్యాణాలక్ష్మి ద్వారా పెళ్లిళ్లు చేసిన ఘనత, లక్షలాది మంది ఆడపడుచులకు కేసిఆర్ కిట్ ఇచ్చిన ఘనత టీఆరెస్ ప్రభుత్వానిదేనన్నారు.

మార్చ్ 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, మహిళా సాధికారికత కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇంతలా అభివృద్ధి జరుగుతుంటే, కొన్ని అభివృద్ధి వ్యతిరేక శక్తులు గోబెల్స్ ప్రచారంకు బ్రాండ్ గా నిలిచారని మండిపడ్డారు.

న్యాయవాదులు న్యాయం వైపు ఉండాలని, వాస్తవాలను సమాజానికి విప్పి చెప్పాలని కోరారు. ఇప్పటికే కేసీఆర్ గారి ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుందని, భవిష్యత్ లో న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో తెరాస నగర అద్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ అడ్వొకేట్లు కొత్త వెంకటేశ్వర రావు, పొట్ల శ్రీకాంత్, బెల్లం ప్రతాప్, హరీందర్ రెడ్డి, కుమ్మరి రామారావు, పసుపులేటి శ్రీనివాస్, హైమవతి, గిరిశాల కృష్ణారావు, మలీదు నాగేశ్వరరావు, మామునూరి మూరళి, మల్లాది వాసుదేవ్, బసవపున్నయ్య, శ్రీకాంత్, హనుమంతరావు, శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు