Telugu News

పోటెత్తిన గోదావరి.. అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి

అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

పోటెత్తిన గోదావరి.. అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి

★★ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం
చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

★★ లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశం

★★ స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు

ఖమ్మం ప్రతినిధి,జులై 10(విజయంన్యూస్)

రాష్ట్రంతో పాటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాల కురుస్తున్న కారణంగా భద్రాచలం వద్ద గోదావరికి ఉదృతంగా నీరు చేరుతూ క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నందున నది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.

Allso read:- నీరు “కారుతున్న” డబుల్ ఇండ్లు

ఇరిగేషన్ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ముంపు ప్రాంతాల్లోని ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేయాలన్నారు.

ముంపునకు గురయ్యే ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, పశువులను మేతకు విడిచిపెట్టకుండా ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్‌ చేయాలని, వాగులు, వంకలు, పంట కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు.

Allso read:- కూలీన ఇళ్ళు.. వృద్ధురాలుకు తృట్టిలో తప్పిన పెను ప్రమాదం

ఈ నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని పరిస్థితులనుబట్టి స్వయంగా సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తానని మంత్రి ప్రకటించారు. భారీ వానలు వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

________________________________

హెల్ప్‌లైన్ నంబర్ల:-

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ 08744-241950, వాట్సప్ నంబర్ 9392929743.

ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్‌ వాట్సప్ నంబర్ 9392919750

సబ్‌కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ 08743232444, వాట్సప్ నంబర్ 6302485393.