Telugu News

హట్యతండాకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని గిరిజనులు

స్పందించిన ఎమ్మెల్యే.. సంఘటనకు వెళ్ళి పరిశీలన

0

హట్యతండాకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని గిరిజనులు

== మొన్న జాతీయ రహదారిపై రాస్తారోకో

== స్పందించిన ఎమ్మెల్యే.. సంఘటనకు వెళ్ళి పరిశీలన

== నిర్మాణం చేయిస్తామని హామి

కూసుమంచి, సెప్టెంబర్ 30(విజయంన్యూస్)

హట్యతండాకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని గిరిజనులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లయీగూడెం గ్రామపంచాయతీ హట్యతండాకు చెందిన గిరిజన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే రెండురోజుల క్రితం నేషనల్ హైవే పై గిరిజనులు రాస్తారోకో నిర్వహించారు.

ఇది కూడా చదవండి:- మహా నగరాలకు దీటుగా ఖమ్మం అభివృద్ధి చేస్తాం కూసుమంచి మండలంలోని హట్యతండా నుంచి హైవే సర్వీస్ రోడ్డు కి దారి ఇవ్వకపోవడంతో పది గ్రామాలకు చెందిన ప్రజలందరు పది కిలోమీటర్ల దూరం చుట్టు తిరిగి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే రోడ్డు మార్గంలో రాజు తండా, ఒంటి గుడిసె తండా, తుమ్మలతండా, గొరిలిపాడు తండా, చాంప్ల తండా, గ్రామాల ప్రజలు ప్రయాణించాల్సి ఉంటుందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని, నడుచుకుంటా వెళ్లే పాలేరు గ్రామం ఇప్పుడు పది కిలోమీటర్ల దూరం వెళ్తేనే పాలేరు వచ్చే పరిస్థితి అయ్యిందని అన్నారు.

 గతంలో అనేక సార్లు అధికారులకు చెప్పినప్పటికి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.  ఎలాంటి దారి లేకపోవడం వల్ల తండాకు అత్యవసరం అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉందని,  రైతులు పండించిన వరి ధాన్యం, పాలేరు ఐకెపి కి తరలించాలంటే కూడా జుజ్జాలరావు పేట నుంచి తిరిగి రావాల్సి వస్తుందని, అలా తిరిగి రావాలంటే 10 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందన్నారు.

ఇది కూడా చదవండి:- కేసీఆర్ జాతీయ పార్టీకి ముహుర్తం పిక్స్..

ఈ లింకు రోడ్డు ఇస్తే తండవాసులు ఐకెపి కి వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల వెళ్ళిపోవచ్చని, 108 వాహనాలు కూడా త్వరగా చేరుకుంటాయని అన్నారు. ఆర్ అండ్ బీ అధికారులు, నేషనల్ హైవే అధికారులు  గమనించి రైతులకు మేలు చేయాలని కోరారు. .  ఆర్ అండ్ బి శాఖ అధికారులు గమనించి ఫీల్డ్ ని చూడవలసిందిగా కోరారు.

** ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ

హత్య తండా గ్రామ గిరిజన ప్రజలు నేషనల్ హైవే వద్ద హట్యతండాకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ మేరకు స్పందించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు గ్రామస్తులతో మాట్లాడారు వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గిరిజనులకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హామీ ఇచ్చారు దీంతో గిరిజనులు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్  రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కూసుమంచి మండలం ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, పాలేరు ఆత్మ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి,కూసుమంచి మండలం జడ్పిటిసి ఇంటూరి బేబీ,మాజీ మండల అధ్యక్షులు చాట్ల పరశురాంమ్, మల్లాయిగూడెం సర్పంచ్ బాదావత్ బీబ్లీ, రవి,  వివిధ నాయకులు సర్పంచులు, గ్రామ నాయకులు, గ్రామ సర్పంచ్, రైతులు పాల్గొన్నారు