Telugu News

కియా కారు ను మార్కెట్ లోకి విడుదల చేసిన మంత్రి పువ్వాడ.

ఖమ్మం-విజయంన్యూస్

0

కియా కారు ను మార్కెట్ లోకి విడుదల చేసిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మం-విజయంన్యూస్)
ఆటోమొబైల్స్ రంగంలో తన స్థానం సుస్థిరం చేసుకున్న ప్రముఖ దక్షిణ కొరియా ఆటో దిగ్గజం తీసుకొచ్చిన నాలుగో ప్యాసెంజర్ కార్ ను ఖమ్మం షోరూమ్ ఆవరణంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విడుదల చేశారు. షోరూమ్ బాద్యులు కారెన్స్ కార్ గురించి మాట్లాడుతూ. కియా కారు వినోదభరితమైన కారు అని పేర్కొన్నారు.

ఇది మూడో వరుసల ముల్టిపర్పస్ వెహికిల్ అని, పెద్ద ఎస్‌యూవీ తరహాలో దీన్ని రూపొందించినట్టు పేర్కొన్నారు. అనంతరం తొలి వాహనాన్ని కొనుగులు చేసిన కస్టమర్ కు కారు తాళం ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరమేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు హాజరైయ్యారు.