11ఏళ్ల బాలుడుకి పునర్ జన్మనీచ్చిన కిమ్స్ వైద్య బృందం
== ధన్యవాదాలు తెలిపిన బాలుడి తల్లిదండ్రులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఈ నెల జూన్ ఒకటో తేదీన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం సమీపములో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. ఈ దుర్గటన లో ముగ్గురు అక్కడి కక్కడే మరణించారు…తీవ్ర గాయాల పాలు అయిన పదకుండు సంత్సరముల బాబు పి. దివిజీత్ ని అపస్మారక స్థితిలో ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ కి తీసుకు రావడం జరిగింది..బాలుడిని వైద్య సేవలు అందించిన వైద్యులు పల్మనాలిజిస్ట్ డాక్టర్ కాట్రగడ్డ యమున….ఆర్థోపెడిక్ డాక్టర్ మేదర మెట్ల అనిల్ కుమార్ ఊపిరితిత్తులు మరియు బుజం ఎముకలు దెబ్బ తిన్నట్లు గుర్తించి వెంటి లెటర్ అమర్చి విరిగిన వాటికి విజయ వంతముగా శస్త్ర చికిత్స చేసి బాలుడు సంపూర్ణముగా కోలుకున్న తర్వాత ఈ రోజు డిశ్చార్జ్ చేశారు..ఈ సందర్బంగా వైద్యుల కి హాస్పిటల్ మేనేజ్ మెంట్ కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు..ఈ సందర్భంగా ప్రాణ పాయం నుండి బాలుడిని కాపాడిన వైద్యులకు కిమ్స్ మేనేజ్ మెంట్ అభినందనలు తెలిపారు
ఇది కూడా చదవండి: ఇరిగేషన్ శాఖలో పైసా వసూల్..?