Telugu News

==కిష్టాపురం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణిపై తహసీల్దార్ కు వినతి

= వేరువేరుగా వినతి చేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ తుమ్మల వర్గీయులు

0

==కిష్టాపురం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణిపై తహసీల్దార్ కు వినతి
== వేరువేరుగా వినతి చేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ తుమ్మల వర్గీయులు
== పూర్తి స్థాయిలో సర్వే చేయిస్తామని హామినిచ్చిన తహసీల్దార్
==(కూసుమంచి-విజయంన్యూస్);-
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం క్రిష్టపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 30 డబల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని, అందుకే పూర్తి స్థాయిలో విచారణ చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి చేశారు. మంగళవారం కూసుమంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు కిష్టాపురం సర్పంచ్ తో కలిసి తహసీల్దార్ శిరీషాకు వినతి చేశారు.

also read :-***కలెక్టర్ సారూ.. మా భూమి పై మాకు హక్కు కల్పించండి

లబ్దిదారుల ఎంపిక విషయంలో జరిగిన తప్పిదాలను తహసీల్దార్ కు వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ఇండ్లు ఇచ్చారని, ఏడాది క్రితం స్థానికంగా వచ్చిన వారికి ఇళ్లు ఇచ్చారని, అనర్హులకు ఇండ్లు ఇవ్వడం వల్ల నిజమైన అర్హులు, నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తప్పకుండా పూర్తి స్థాయిలో మరోసారి గ్రామంలో విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమెకు వినతి పత్రాన్ని అందించారు.

also read :-==భట్టి ’మహా పాదయాత్ర‘

ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షుడు మట్టెగురవయ్య, మండల నాయకులు ఎండీ.హాపీజుద్దీన్, పెండ్ర అంజయ్య, బెల్లంకొండ శరత్ గౌడ్, నాగిరెడ్డి రమేష్ రెడ్డి, తుపాకుల వెంకన్న, మీరా, పందిరి సత్యనారాయరెడ్డి, రాంరెడ్డి, చిన్న సంగయ్య తదితరులు హాజరైయ్యారు.

== తహసీల్దార్ కు వినతి చేసిన తుమ్మల వర్గీయులు
కిష్టాపురం గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక విషయంలో అవకతవకలు జరిగాయని, ఎటువంటి అవకతవకలు జరగకుండా నిరుపేద కుటుంబానికి చెందిన నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణి చేయాలని కూసుమంచి తహసీల్దార్ జి శిరీష కి టీఆర్ఎస్ పార్టీ తుమ్మల వర్గీయులు కిష్టపురం గ్రామ పెద్ద, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముద్దిరెడ్డి కేశవరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ వినతి చేశారు. సమగ్రంగా విచారణ చేసి దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వర్గీయులు మాజీ ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జొన్నలగడ్డ రవి కుమార్, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, బారి వీరభద్రం, కూరపాటి వేణు, కొండా మహిపాల్, అర్వపల్లి జనర్దన్, మంద విష్ణు, బానోత్ సీతరాములు, కిష్టాపురం గ్రామా ప్రజలు పాల్గొనడం జరిగింది.