Telugu News

ఆరేళ్ళ బాలికపై లైంగికదాడి అమానుషం

నిందితుడిని కఠినంగా శిక్షించాలి.

0

ఆరేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడి అమానుషం.
*నిందితుడిని కఠినంగా శిక్షించాలి.
*బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి.
** లంబాడి పోరాట హక్కుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్.

(ఖమ్మం-విజయం న్యూస్)

ఆరేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడికి పాల్పడటం అమానుషమని, ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు బధ్రు నాయక్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామంలో, గ్రామ సర్పంచ్ భర్త అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకుడు అభం శుభం తెలియని ఆరేళ్ల గిరిజన బాలికపై అమానుషంగా, అఘాయిత్యా నికీ పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం రాజకీయాలకతీతంగా దర్యాప్తు చేసి , నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

also read :- బుల్లెట్ బండి ఎక్కోస్తావా.. డుగ్గుడుగ్గంటూ..