Telugu News

ఖమ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మ్రతి

మరో ముగ్గురికి సీరియస్.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు

0

ఖమ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మ్రతి

== మరో ముగ్గురికి సీరియస్.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు

(ఖమ్మం-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో విషాదం నెలకొంది. చెట్టు కూలీ ఖాళీ పడటంతో క్రికెట్ ఆడుతున్న ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మఈతి చెందగా, మరో చిన్నారికి తీవ్రగాయాలైయ్యాయి. దీంతో ఆ బాలుడ్ని తక్షణమే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ బాధకర సంఘటన మంగళవారం ఖమ్మంనగరంలో బ్రహ్మణ బజారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరంలోని బ్రహ్మణ బజార్ లో చిన్నారులు  ఓ చెట్టు కిందా క్రికెట్ ఆడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు రావడంతో ఆ బజారులో ఉన్న చిన్నారులందరు ఒక వద్దకు చేరి క్రికెట్ ఆడుతుండగా సాయంత్రం 5.30గంటల సమయంలో ఒక పెద్ద చెట్టు విరిగి పడింది. దీనిని గమనించకుండా ఆడుకుండుటంతో ఆ చిన్నారులపై చెట్టు కూలి పడింది. దీంతో ఇద్దరు చిన్నారులు పై చెట్టు కూలి పడటంతో అక్కడిక్కడే మ్రతి చెందగా, మరో మగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలైయ్యాయి. వారిని స్థానికులు తక్షణమే చెట్టు కిందనుంచి బయటకు తీసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ బజారులో విషాదం నెలకొంది.. చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

allso read :- చంద్రబాబు కు కరోనా పాజిటివ్..*