Telugu News

వర్షాకాలం…వ్యాధులకాలం…జాగ్రత్త సుమా

0
వర్షాకాలం…వ్యాధులకాలం…జాగ్రత్త సుమా*
*మన ఆరోగ్యం మన చేతుల్లో*
అశ్వారావుపేట జూలై 7( విజయం న్యూస్)
వర్షాలు జోరందుకొన్నాయి..దాంతో వ్యాధులు కూడ ఊపందుకోవడానికి సిద్దంగా ఉన్నాయి.ఈ కాలం లొ డెంగీ, మెదడు వాపు, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజన్ వ్యాధులతో ముప్పు పొంచి ఉంది.ప్రతి యేట ఈ వ్యాధులు రాష్ట్రంలో ప్రభలి,అనేక మంది మ్రుత్యువాత పడిన విషయం విధితమే.ఈ కాలంలో . గ్రామాల్లో కలుషితమైన నీరు, అపరిశుభ్ర వాతావరణం, దోమల విజృంభణ కారణంగా ఈ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా వీటి బారిన పడక తప్పదు.ఈ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది .
◆◆ మన ఆరోగ్యం మన చేతులలొ*
 ఈ  వ్యాధులు రాకుండా ఉండేందుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.అ జాగ్రత్తలు పాటిస్తే మన అరోగ్యం మన చేతులలొ ఉంటుంది. సహజంగా ఈ సీజన్ లొ వచ్చే వ్యాధులు వాటి లక్షణాలను తీసుకోవలిసిన జాగ్రత్తలను పరిశీలిద్దాం.
◆◆ *మలేరియా..*
సాయంత్రం పూట విడవకుండా జ్వరం రావడంతో పాటు చలి, వణుకు ఉంటుంది. ఈ లక్షణాలను బట్టి చికిత్స చేయించాలి. రక్త పరీక్ష చేసిన వెంటనే మలేరియా క్రిములు కనబడవు. శరీరంలోకి ప్రవే శించిన తర్వాత కొద్దిరోజులకు మాత్రమే పరీక్షల్లో బయటపడతాయి. అప్పటి వరకు వేచి చూస్తే మలేరియా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. రోగ కారణాలు మెదడు మీద ప్రభావం చూపితే మలేరియాకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వ్యాది రాకుండా అరికట్టాలంటే దోమలు లేకుండా చేసుకోవాలి. మురుగు నీరు నిలవ ఉండకుండా చూడాలి
బొండాలు, టైర్లు ఇంట్లో ఉంచకూడదు. కూలర్లలో నీటిని ప్రతి మూడు రోజులకోసారి మార్చుకోవాలి..
మరో ముఖ్యమైన వ్యాధి.
◆◆ *డెంగీ ..*
దోమల ద్వారా వ్యాధిగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు డెంగీ వ్యాపిస్తుంది. దోమ కుట్టిన తర్వాత 5 నుంచి 8 రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఉన్నట్టుండి  జ్వరం రావడంతో పాటు తలనొప్పి అధికమవు తుంది. కంటి కదలికల సమయంలో భరించలేని నొప్పి ఉంటుంది. కండరాలు కీళ్ల నొప్పులు బాధిస్తాయి. నోరు ఎండిపోవడం, అధిక దాహం, ఒళ్లు నొప్పులు, శరీరంపై ఎర్రటి దద్దులు, నాడి నెమ్మదిగా
కొట్టుకోవడం వంటివి జరుగుతాయి.
◆◆ *తీసుకోవాల్సిన జాగ్రత్తలు*
డెంగీ కారక దోమ పగటి పూట కుడుతుంది. ఆ ణ జాగ్రత్తగా ఉండాలి. పూల కుండీలు.. ఎయిర్ కూలర్లు, నీటి నిల్వ తొట్లు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా  కప్పి ఉండేలా దుస్తులు ధరించాలి.
◆◆ *మెదడువాపు..*
ఇది వైరస్ వల్ల వస్తుంది. మెదడువాపు కలిగించే దోమలు.. పందుల నుంచి వైరస్ను గ్రహించి ఆరోగ్యవంతులను కుట్టడం ద్వారా వ్యాపింపజేస్తాయి. పది రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అయితే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తిచెందదు. ఒకటి నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా జ్వరం వస్తుంది. కళ్లు తిరుగుతాయి. ఏదో ఒక పక్క శరీరం పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. వాంతులు ,విరోచనాలు అవుతాయి. కొన్నిసార్లు ఫిట్స్
కూడా రావచ్చును.
◆◆ *జాగ్రత్తలు..*
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రత పాటించాలి. దోమల తెరలను వాడాలి. పందులను దూరంగా   ఉంచాలి. ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూడాలి. పిల్లలకు జ్వరం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
◆◆ *చికెన్ గున్యా*
పగటి పూట కుట్టే దోమ ద్వారా చికెన్ గున్యా జ్వరం వస్తుంది.లోమకాటుకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. తీవ్ర జ్వరం. కీళ్ల నొప్పులు, వాపుతో పాటు నడిచే ఓపిక ఉండదు. ఒళ్లు నొప్పులు బాధిస్తాయి
*తీసుకోవాల్సిన జాగ్రత్తలు..*
భరించలేని ఒళ్లు నొప్పులు, జలుబుతో బాధపడే వారు వెంటనే వైద్యుడిని సంప్రందించాలి. దగ్గు, జలుబు, రోగులు వాడిన వస్తువులు ఇతరులు వాడరాదు.