పొంగులేటి పేరేత్తారని ఆటో డ్రైవర్ పై దాడి
== పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఓ మీడియా చానల్ అతను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు అనంతరం జరిగిన పరిణామాలపై, మీరు ఏమనుకుంటున్నారని నన్ను అడగ్గా అందులో మంత్రిపై తప్పుడు వార్తలు చేశామని ముకూమ్మడిగా దాడి చేశారని బాధితుడు టి రామకృష్ణ మీడియాకు తెలిపారు. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో టి రామకృష్ణ అనే యువకుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రోజులాగే ఆదివారం ఓ న్యూస్ చానల్ వారు వచ్చి తమ అబిప్రాయం చెప్పామన్నారని, నా అభిప్రాయాన్ని చెప్పానని అన్నారు. దీంతో కక్ష్య కట్టిన మంత్రి అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు టి రామకృష్ణపై విచక్షణారహితంగా కొట్టి తన ఆటోను కూడా బిఆర్ఎస్ నాయకులు దాడి చేశారని, ఎవరికైనా చెప్పినట్లు తెలిస్తే డైరెక్టర్ గా లేపేస్తామని బెదిరించారని బాధితుడు తెలిపారు. దీంతో బాధితుడు టి రామకృష్ణ తక్షణమే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే ఈ కేసు విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
allso read- పల్లెకు ప్రతినిధులు..ప్రజల్లోకి నేతలు