ఛలో మహుబాద్ కు లంబాడిలందరు తరలిరండి
విలేకర్ల సమావేశంలో పిలుపునిచ్చిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్యనాయక్
ఛలో మహుబాద్ కు లంబాడిలందరు తరలిరండి
== జులై 1న జరిగే ఎల్ హెచ్ పీ ఎస్ జాతీయ సభలను జయప్రదం చేయండి
== విలేకర్ల సమావేశంలో పిలుపునిచ్చిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్యనాయక్
ఖమ్మం, జూన్ 26(విజయంన్యూస్)
జులై 1న మహుబాద్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ సభలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న లంబాడీ బిడ్డలందరు తరలిరావాలని, పెద్ద ఎత్తున జరిగే సభను జయప్రదం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ కోరారు. ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అవిర్భావ దినోత్సవ సభను మహుబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
allso read- షర్మిల పాలేరులో నెగ్గుతుందా…?
సంఘాన్ని ఏర్పాటు చేసి 25ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అద్భుతంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ 25ఏళ్ల కాలంలో సంఘం అనేక డిమాండ్లను సాధించుకుందన్నారు. మన తండాలో మన పరిపాలన అంటూ సాగించిన ఉద్యమం అద్భుత విజయం సాధించిందన్నారు. తెలంగాణ,
ఏపీలో లంబాడీ తండాలున్న ప్రతి తండాను పంచాయతీలకు మార్చుకునేందుకు ఎల్ హెచ్ పీ ఎస్ ఉద్యమ ఫలితమేనని అన్నారు. అలాగే అనేక సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు. ఇంకా లంబాడీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చవితి ప్రేమను చూపిస్తూనే ఉన్నాయని అన్నారు. గిరిజనులపై నేటికి దాడులు జరుగుతూనే ఉన్నాయి, కులంపేరుతో దూషణలు చోటు చేసుకుంటున్నాయని, అవన్ని సాధషించుకోవాలంటే కచ్చితంగా లంబాడి నాయకులు ఐక్యమత్యంతో ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అందుకే లంబాడి నాయకులు, ప్రజలు ఐక్యమత్యంగా ఉన్నరు అని చెప్పేందుకే మహుబాద్ లో సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మన హక్కుల సాధన కోసం, మన జాతి సంస్కతిని కాపాడుకోవడం కోసం, ఎలాంటివారినైనా ఎదరించి పోరాడాలని వారు కోరారు. మన తండాలో మన రాజ్యం సాధించుకొని రాజ్యంగం వైపు ప్రయాణించాలని కోరారు. యువతకు సంఘంలో ప్రాథాన్యత పోస్టులు ఇవ్వాలని, లంబాడి భావితర ఉద్యమం కోసం ప్రయాణించాలని కోరారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాస్ నాయక్ మాట్లాడుతూ మహుబాద్ లో జరిగే జాతీయ సభకు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన బిడ్డలు తరలివస్తున్నారని, తెలంగాణ లంబాడి బిడ్డలు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా కోట్యానాయక్, బంజార న్యూస్ టీవీ చైర్మన్ మోతిలాల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ బిక్షపతి రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రమేష్ నాయక్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.రవిచంద్రచౌహన్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోతు మోతిలల్, తదితరులు హాజరైయ్యారు.