కాంగ్రెస్ కన్నెర చేస్తే బీజేపీ ఖతమే : భట్టి
బీజేపీ పై మండిపడిన తెలంగాణ శాసనసభా పక్షనేత మల్లుభట్టి విక్రమార్క
కాంగ్రెస్ కన్నెర చేస్తే బీజేపీ ఖతమే
== దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబంపై ఈడీ వేదింపులా..?
== రాహుల్ గాంధీపై ఈడి వేధింపులు ఆపాలి
== లేకుంటే దేశవ్యాప్తంగా మరింతగా ఆందోళనలు చేస్తాం
== ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్షాలపై దాడులు
== తెలంగాణ శాసనసభా పక్షనేత మల్లుభట్టి విక్రమార్క
== శాంతియుత నిరసన తెలియజేస్తే కేసీఆర్ మండిపడుతున్నాడేందుకో..?
== పోలీసులు కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారు
== పోలీసుల తీరు మార్చుకోవాలి..లేకుంటే అందరి జాతకాలు రాస్తున్నాం
== కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మోడీ, అమిత్ షా, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం
allso read-కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం తథ్యం: భట్టి విక్రమార్క
ఖమ్మం ప్రతినిధి, జూన్ 17(విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే,కాంగ్రెస్ నేతలు కన్నేర్ర చేస్తే దేశంలో బీజేపీ పార్టీ ఉంటుందా..? అని తెలంగాణ శాసనసభ పక్ష నేత, మధిర శాసనసభ్యుడు భట్టి విక్రమార్క ద్వజమెత్తారు. రాజ్యాంగ బద్ద సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలతో కేంద్రం ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భట్టీ విక్రమార్క ఆరోపించారు. గత నాలుగు రోజుల నుండి రాహుల్ గాంధీని ఈడీ విచారణ పేరిట వేధించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్వంలో శుక్రవారం ఖమ్మం తపాల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి బొమ్మన సెంటర్లో గల కేంద్ర ప్రభుత్వ కార్యాలయమైన తపాలాశాఖ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్ళి ధర్నా చేశారు. సుమారు నాలుగు గంటల పాటు నిండు ఎండను సైతం లెక్క చేయకుండా ధర్నా చేశారు. అనంతరం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవరిస్తున్న తీరుకు నిరసనగా ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎల్పి నేత మల్లుభట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాంతి యుతంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే పోలీసు ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ గుండాలు తమ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
allso read- ఆ ఇద్దరికి చెక్ పెట్టేందుకేనా..?
బ్యాంకుల నుండి వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను స్వదేశానికి తీసుకురా లేని చేతగాని అసమర్థ బీజేపీ ప్రభుత్వం దేశభక్తుల కుటుంబమైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లపై ఆర్థిక భారం మోపి విచారణ పేరిట వేధింపులకు గురి చేయడం నీతి మాలిన చర్య అని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక నష్టాల్లో ఉంటే దాన్ని ఆదుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా సోనియా, రాహుల్ గాంధీలు రుణసాయం చేయడం నేరమా అని ప్రశ్నించారు. నేషనల్హెరాల్డ్ పత్రిక తిరిగి ప్రారంభం కావడంతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అరాచకాలు, అవినీతి గుట్టు హిందుత్వం పేరుతో చేస్తున్న మతోన్మాద రాజకీయ బండరాలు బయట పడతాయనే భయంతో బీజేపీ కాంగ్రెస్ అధినాయకత్వంపై అక్రమ కేసులు పెట్టి వేదిస్తోందని విమర్శించారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేని నేషనల్ హెరాల్డ్ పత్రికలో బీజేపీ ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా ప్రతిపక్షాలను అణగదొక్కాలనే ఉద్దేశంతో కేంద్రం రాజ్యాంగబద్ద సంస్థలతో దాడులకు పూనుకుందని అన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకురాడంలో రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణాలను సైతం లెక్కచేయలేదని అలాంటి కుటుంబం నుంచి వ్యక్తుల మీద లేనిపోని నిందలు మోపి వారిని ఇబ్బందులకు గురి చేయడం భారత దేశానికి అవమానకరమని ఎద్దెవా చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు 2012లో ముగిసిందని అప్పటి ఎన్నికల కమిషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని కొట్టేశాయాని అన్నారు. ఇప్పుడు మరల ఆర్ఎస్ఎస్ భావజలం ఉన్న వ్యక్తిని ఈడీ డైరెక్టర్ గా పెట్టుకుని మోడీ ప్రశ్నించే వారిపై తప్పుడు అభియోగాలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. యావత్ దేశ ప్రజలందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని బీజేపీ మోపుతున్న అక్రమ కేసులకు కాంగ్రెస్ అధినాయకత్వం బయడపడని కాంగ్రెస్ కన్నెర చేస్తే బీజేపీ నాయకులు రోడ్డుపై తిరుగలేరని హెచ్చరించారు. ఇకనైనా ప్రతిపక్షాలపై దాడులు ఆపి ప్రజాస్వామ్య బద్ధంగా పాలన నడిపించాలని లేకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ ప్రజలు తిరుగుబాటుకు ఎనకాడబోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్రావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయల నాగేశ్వర్రావు, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యాక్షులు రాందాస్ నాయక్, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ దర్జీ చెన్నారావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, జిల్లా ఒబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మున్సిపల్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, మహ్మద్ రఫీదా. భేగం, లకావత్ సైదులు నాయక్, పల్లెబోయిన చంద్రం, మోతుకూరి దర్మారావు, కల్లెం వెంకటరెడ్డి, పొదిలా హరనాధబాబు, కందుకూరి వెంకటనారాయణ, బోజడ్ల సత్యనారాయణ, బాణాల లక్ష్మణ్, చింతమల్ల ఉదయ్ కుమార్, గజ్జెల్లి వెంకన్న, శంకర్ నాయక్, బిక్షపతి రాథోడ్, దివ్య, ప్రదిక్షా, లింగం శ్రీనివాస్, మహ్మద్ గౌస్, కాల్వ నర్సింహరావు, నల్లపు దుర్గాప్రసాద్, కొమ్మినేని రమేష్ బాబు, మాజీ జెడ్పీటీసీ కూరపాటి కిషోర్, మద్దివీరారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు బందెల నాగర్జున, పమ్మి ఆశోక్, మామిడాల వెంకన్న, ఎస్కే. జహీర్, గంగాధర్, బచ్చలకూర నాగరాజు, ఆహద్, అమిద్, గోపి, శీలం శీను, రమేష్, ఉపేందర్, పెండ్ర అంజయ్య, గుడిపూడి వెంకటేశ్వర్లు, నాగరాజు, అంజని కుమార్, వేణు వివిధ మండలాల నుంచి వచ్చిన మండల నాయకులు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.